అనురాగ్ కొణిదెన.. తొలి ప్రయత్నమే విజయం!

0
153

అనురాగ్ కొణిదెన.. ‘మళ్లీ మళ్లీ చూశా’ అనే తొలి చిత్రంతోనే విజయం సాధించాడు. ఈ మధ్యే వచ్చిన ‘చిత్రలహరి’ సినిమాలో సాంగ్ మాదిరిగా.. ‘ప్రయత్నమే తొలి విజయం..’ అన్నట్లుగా అనురాగ్ కూడా తొలిప్రయత్నం గట్టిగానే చేశాడు. ఈ సినిమాతో ఏ మేరకు పేరు, గుర్తింపు సంపాదించుకున్నాడనేది పక్కనెడితే ఫస్ట్ అటెంప్ట్ మాత్రం బాగుంది.. మున్ముంథు తన నటనకు కాస్త పదునుపెట్టి.. ఒకటికి రెండుసార్లు ఆలోచించి మరీ కథలు ఎంచుకుంటే మంచిది. ఒక్క మాటలో చెప్పాలంటే లవ్ ట్రాక్.. మాస్ రేంజ్ కథలు ఈ కుర్ర హీరోకు బాగా సెట్ అవుతాయ్. ఎందుకంటే.. ‘మళ్లీ మళ్లీ చూశా’ యాక్షన్ సీన్స్‌ను బట్టి చూస్తే మాస్ ఆడియన్స్‌గా బాగా దగ్గరయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయ్.

ఇంతకీ అనురాగ్ కొణిదెన ఎవరు!?
సినిమా టైటిల్ అనౌన్స్ చేయడం మొదలుకుని రిలీజ్ వరకు అసలు అనురాగ్ కొణిదెన ఎవరు..? ఏ బ్యాగ్రౌండ్‌తో ఇండస్ట్రీలోకి వచ్చాడు..? ఎవరి సపోర్ట్‌తో వచ్చాడు..? అనేది టాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని రోజులపాటు చర్చనీయాంశమైంది. అయితే.. ‘మళ్లీ మళ్లీ చూశా’ సినిమాకు ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన కె. కోటేశ్వరరావు.. అనురాగ్ కొణిదెనకు తండ్రి. స్వగ్రామం విజయవాడ.. హైదరాబాద్‌లో కోటేశ్వరరావు కుటుంబం వెల్ సెటిల్డ్. ఇంజనీరింగ్ చదివిన ఈ కుర్రాడు కన్‌స్ట్రక్షన్‌, సినిమా రంగం రెండింటినీ ఇష్టపడ్డాడు. చదువు అయిపోయాక తండ్రి వ్యాపారం చూసుకుంటూ.. యాక్టింగ్‌ మీద ఫ్యాషన్‌తో రామానాయుడు ఫిలిం స్కూల్‌లో యాక్టింగ్‌ కోర్స్‌ పూర్తి చేశాడు. ప్రొడ్యూసర్ కుమారుడు కావడం.. పైగా పేరుగాంచిన రామానాయుడు ట్రైనింగ్ స్కూల్‌లో శిక్షణ తీసుకోవడంతో ఎంట్రీతోనే టాలీవుడ్ సినీ ప్రియులను ఆకట్టుకున్నాడు. మున్ముంథు మంచి కథలు ఎంచుకుని.. టాలీవుడ్‌లో నిలదొక్కుకోవాలని ఆకాంక్షిస్తోంది మీ ఈ www.ranarangam.com.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here