ఆధారాలు చూపిస్తా.. నేను రెడీ.. హరీశ్ సిద్ధమా?: వంటేరు

1
658

హైదరాబాద్: రాష్ట్ర మంత్రి హరీశ్ రావుపై గజ్వేల్ కాంగ్రెస్ నాయకుడు వంటేరు ప్రతాపరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీశ్ తనను చూసి భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. గతంలో తానూ, హరీశ్ రెండు సార్లు కలిసి కూర్చొని మాట్లాడుకున్నామంటూ మరో సంచలన విషయాన్ని బయటపెట్టారు. ప్రైవేట్ నంబర్ నుంచి కాల్ చేసి మాట్లాడిన దానితో సహా అన్నింటికీ ఆధారాలున్నాయన్నారు. హైదరాబాద్‌లోనే తమ భేటీ జరిగిందని.. సమయం, సందర్భం వచ్చినప్పుడు ఆధారాలు చూపిస్తానని అన్నారు. ఆధారాలు కచ్చితంగా అందిస్తానన్నారు. ఏ దేవుడి ముందైనా ఒట్టు వేయడానికి తాను రెడీయని.. హరీశ్ సిద్ధమా? అని ప్రశ్నించారు. నిజానిజాలు నిలకడమీద బయటపడతాయన్నారు.

ఓ టీవీ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వంటేరు ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. హరిశ్ గజ్వేల్ జీతగాడైపోయాడని విమర్శించారు. తనను ఓడించాలని కంకణం కట్టుకున్నానని హరీశ్ అనడంతోనే ఆయన భయమేంటో తెలిసిపోయిందన్నారు. ఆయన ఎమ్మెల్యే స్థాయికి దిగజారారని.. తీవ్ర అసహనానికి గురవుతున్నాడన్నారని ఆరోపించారు. రాష్ట్ర నాయకుడైన హరీశ్.. గ్రామంలో ఉండి..గ్రామస్థాయి నాయకుడైన ప్రతాప్‌ను ఛాలెంజ్ చేస్తున్నాడని విమర్శించారు. దోషి ఎవరో ప్రజలకు తెలుసని.. అవినీతిపరుడెవరో.. లూటీ చేస్తుంది ఎవరో.. తెలుసన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఆంధ్రా కాంట్రాక్టర్లతో కుమ్మక్కు కావడం లేదా? తెలంగాణలో కాంట్రాక్టర్లు లేరా? అని సూటిగా ప్రశ్నించారు. 2001 నుంచి ఇప్పటి వరకు హరీశ్ ఆస్తుల విలువ ఎంతో చెప్పాలని డిమాండ్ చేశారు. గజ్వేల్‌లో తన గెలుపు.. కూటమి అధికారంలోకి రావడం ఖాయమని ఉద్ఘాటించారు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here