ఆర్జీవీ మొట్ట మొదటి అపజయానికి కారణం ‘ఆమే’!

kethireddy jagadishwar reddy details press note about lakshmis ntr, rgv and lakshmi parvathi

0
573

టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ మొట్ట మొదటి అపజయానికి కారణం లక్ష్మీ పార్వతేనని దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి చెప్పుకొచ్చారు. గురువారం అర్ధరాత్రి రణరంగం.కామ్ ప్రతినిధితో ఫోన్‌లో మాట్లాడిన ఆయన.. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం గురించి.. లక్ష్మీ పార్వతి జీవితంలో జరిగిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆయన మా ప్రతినిధితో పంచుకున్న విషయాలను యథావిథిగా ప్రచురించడం జరిగింది.

ఆర్జీవీ జీవితంలో ఫస్ట్ టైమ్..

ఎన్ని వివాదాలు ఎదురైనా సరే రక్త చరిత్ర, వంగవీటి లాంటి సినిమాలను అనుకున్న టైమ్‌కే విడుదల చేసి తన సత్తా ఏంటో ఆర్జీవీ నిరూపించుకున్నారని.. అయితే ఆయన డైరెక్షన్ జీవితంలో ఫస్ట్ టైమ్ లక్ష్మీ పార్వతి వల్ల ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీని రిలీజ్ చేయలేకపోయారని కేతిరెడ్డి విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం ఏపీలో ఆర్జీవీ బొమ్మ పడకుండా ఉండేందుకు కారణం లక్ష్మీ పార్వతేనని అన్నారు. వంగవీటి సినిమా రిలీజ్‌కు ముందు జరిగిన వివాదాలు, వార్నింగ్‌లను ఈ సందర్భంగా కేతిరెడ్డి గుర్తు చేశారు. అంతటి ఆర్జీవీ లక్ష్మీపార్వతి వల్లే ఫస్ట్ టైమ్ అబాసుపాలయ్యారన్నారు. బహుశా ఇలా జరుగుతుందని ఆర్జీవీ తన జీవితంలో ఎప్పుడూ ఊహించి ఉండరని కేతిరెడ్డి చెప్పుకొచ్చారు.

లక్ష్మీ పార్వతి లెగ్ మహిమ!
లక్ష్మీ పార్వతి లెగ్ పడితే ఏదైనా సరే మటాష్ అవ్వాల్సిందేనని.. ఆమె లెగ్ మహిమ అలాంటిదని కేతిరెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆమె జీవితంలో సాధించిందేమీ లేదని అందర్నీ ముంచేసే మహిళ అని ఆయన చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా గతంలో జరిగిన కొన్ని విషయాలను పంచుకున్న కేతిరెడ్డి.. వీరగ్రంథం జీవితాన్ని సర్వనాశనం చేసిందని.. అలాగే ఆంధ్రుల ఆరాధ్యుడు, దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జీవితంలోకి ప్రవేశించిన లక్ష్మీ పార్వతి ఆ ఇద్దరి జీవితాలను సర్వనాశనం చేసిందన్నారు. అంతేకాదు తాజాగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను తెరకెక్కించిన ఆర్జీవీ మొట్టమొదటి అపజయానికి ఆమే కారణమని ఆయన చెప్పుకొచ్చారు.

సినిమా రిలీజ్ కాదని చెప్పా..!
” ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం విడుదల కాదు అని నేను గతంలో నేను చాలా సార్లే చెప్పాను. నేను చెప్పినట్లుగానే ఇప్పుడు జరిగింది. కొన్ని సజీవమైన పాత్రలను పాత్రలను రిలీజ్ చేయడం జరిగింది.. దీంతో సెన్సార్ మొదలుకుని.. ఎన్నికల కమిషన్ కూడా బ్రేక్ వేస్తుందని గతంలోనే చెప్పాను. సరిగ్గా ఎన్నికల టైమ్‌లో ఈసీ మొట్టికాయలేసింది. తెలంగాణలో ఎన్నికలూ లేవు.. అంతేకాకుండా టీడీపీ అధికారంలో లేదు గనుక ఎలాంటి ప్రభావం ఉండదు. సినిమా ఫస్ట్ పోస్టర్ మొదలుకుని ట్రైలర్స్ వరకు అన్నీ నిశితంగా గమనిస్తే.. మొత్తం చంద్రబాబునే టార్గెట్ చేసినట్లు ఉందని తద్వారా రిలీజ్‌కు నోచుకోదని మొట్టమొదట వాయిస్ లేపింది నేనే” అని కేతిరెడ్డి చెప్పుకొచ్చారు.

నా సినిమాకు ఎలాంటి అడ్డంకులుండవ్.. రిలీజ్ చేస్తా!
వాస్తవ పరిస్థితులను పరిగణనలోనికి తీసుకుని నేను సినిమా తెరకెక్కించాను. నా సినిమాకు అనుకున్న రోజుకే విడుదల అవుతుంది. ఏప్రిల్ 8న ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ సినిమాను విడుదల చేస్తాం. మా సినిమాకు ఎలాంటి అడ్డంకులు, అభ్యంతరాల్లేవ్. నన్ను అన్న ప్రతీ చెడుమాటలకు సమాధానమే ఈ ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ సినిమా. ఇప్పటికే లక్ష్మీ పార్వతి, ఎన్టీఆర్ జీవితం ఆధారంగా వచ్చిన వీరగ్రంథం టీజర్, టైలర్‌కు విశేష స్పందన లభించింది”అని కేతిరెడ్డి స్పష్టం చేశారు.

లక్ష్మీ పార్వతి గురించి…
“23 సంవత్సరాల జరిగిపోయిన వ్యవహారాన్ని సినిమా రూపంలో తెరకెక్కించి లబ్ది పొందాలని ఆమె చూస్తున్నారు. ఆమె జిమ్మిక్కులు ఎవరికి తెలియవని ఇలా చేస్తున్నారో అర్థం కావట్లేదు. ముఖ్యంగా ఈ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రంతో ఆమె ఏదో ఒరుగుతుందని అనుకుంటున్నారు. ఒరిగేదేమీ లేదు. చేయాల్సిందంతా చేసేసి ఇప్పుడేదో వీర వనితలాగా, ఝాన్సీ లక్ష్మిబాయిలాగా ఉన్నారని మీ చిత్రాలను చూసే వాళ్లు ఎవరూ లేరు. సినిమా చూసిన తర్వాత జనాలు ఛీ కొడతారే తప్ప.. ఎవరూ ఆమెను మెచ్చుకోరు. ముఖ్యంగా
వైసీపీ వాళ్లు ఈ సినిమాను పెద్దగా పట్టించుకోవట్లేదు. ఈ సినిమాల వల్లే ఎన్నికల్లో ప్రభావితం జరుగుతుందనుకోవడం వాళ్ల మూర్ఖత్వం. ఠాగూర్, స్టాలిన్‌లలో చిత్రాలను నటించిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లో ఎందుకు ఫెయిల్ అయ్యారంటే సమాధానాలు దొరకవు” అని కేతిరెడ్డి ఉదహరించి మరీ చెప్పారు.

ఆర్జీవీ ఇకనైనా తెలుసుకో..!?
ఎక్కడా బ్రేక్ లేని ఆర్జీవీ సినీ జీవితంలో ఫస్ట్ టైమ్ లక్ష్మీ పార్వతి లెగ్ పడటంతో సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. ఆర్జీవీ ఇకనైనా తెలుసుకో.. నీ జీవితంలో నీకు ఎన్నో సినిమాలు రిలీజ్ కాని.. బొమ్మ పడని రోజుల్లేవ్.. ఇప్పటి వరకూ నీ సినిమాలన్నీ రిలీజ్ అయ్యాయి. నీకు జరిగిన ఈ సినిమా నిలుపుదలకు కారణం లక్ష్మీ పార్వతి. దేశానికి.. ఏపీ ప్రజానీకానికి ఎంతో సేవ చేసిన దేవుడులాంటి అన్నగారు ఎన్టీఆర్ జీవితాన్ని సర్వనాశనం చేసిన లక్ష్మీ పార్వతి లెగ్ పడితే ఎవరి పరిస్థితి అయినా ఇలానే ఉంటుంది. అందుకే కొన్ని కొన్ని విషయాలు తెలుసుకోవాలి ఆర్జీవీ..” అని ఆర్జీవీకి కేతిరెడ్డి కొన్ని సలహాలు ఇచ్చుకున్నారు.

విర్రవీగావ్ కదా పార్వతీ..!
కొన్ని రోజుల క్రితం లక్ష్మీ పార్వతి మీడియాతో మాట్లాడుతూ.. భావ స్వేచ్ఛ ప్రకారం సినిమా తీసుకోవచ్చని ఆర్జీవీ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ద్వారా పగ తీర్చుకున్నానని పెద్ద పెద్ద మాటలు అన్న విషయం విదితమే. ఈ వ్యాఖ్యలకు కేతిరెడ్డి కౌంటర్‌గా..” చేయాల్సిందంతా చేసేశావ్. ఇకనైనా మిన్నకుండాల్సింది పోయి సినిమాలు ఇలాంటి వన్నీ మీకు అవసరమా..? అసలు కృష్ణా రామా అనుకోవాల్సిన టైమ్‌లో ఈ సినిమాలు అవసరమా..? విర్రవీగుతూ మాట్లాడావ్.. నీ మాటల వల్లే సినిమా ఆడలేదు. మొత్తం నీ వల్లే జరిగింది. బహుశా ఆర్జీవీ కూడా చాలా బాధపడి ఉంటారేమో. ఆర్జీవీ మొట్ట మొదటి అపజయానికి మీరే కారణం లక్ష్మీ పార్వతీ..” అని కేతిరెడ్డి చెప్పుకొచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here