ఆలీ సెల్ఫ్ డబ్బా.. ప్రమోషన్ కోసం ఇదో లాజిక్కు!

0
359

వైసీపీలో చేరడాన్ని పవన్‌ తప్పుబట్టడం ఆలీకి అస్సలు నచ్చలేదు కావచ్చు. తనకి సాయం చేసినా గుర్తుంచుకోలేదు అని పవన్‌ అన్న మాటలతో ఆయన బాగా నొచ్చుకునట్టున్నారు. అసలు పవన్ ఏ సాయం గురించి మాట్లాడాడో క్లారిటీకి రాకముందే.. మేటర్‌ని పక్కదోవ పట్టించి ఆలీ సెల్ఫ్‌ డబ్బా కొట్టుకోవడం సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ మారింది.

పవన్ పై విరుచుకుపడుతూ ఓ వీడియోతో జనం ముందుకొచ్చిన ఆలీ.. వైసిపీలోనే చేరాలని అనుకున్నపుడు ముందుగా టీడీపీలో టికెట్‌ ఎందుకు ఆశించి భంగపడ్డాడో మాత్రం చెప్పకపోవడం గమనించదగిన విషయం. ఇక ఇదిలా ఉంటే పవన్‌ని తాను పల్లెత్తు మాట అనలేదని ఆలీ బుకాయించాడు. పబ్లిక్‌ మీటింగ్స్‌లో, ఎలక్షన్‌ ర్యాలీల్లో ఆలీ ఏమీ అని వుండకపోవచ్చు. కానీ పవన్‌ని కిండల్‌ చేస్తూ పోసాని కృష్ణమురళి తీసిన ‘ముఖ్యమంత్రిగారూ మీరు మాటిచ్చారు’ సినిమాలో ‘పవన్‌కళ్యాణ్‌’గా నటించాడు ఆలీ.

ఆ సినిమాలో.. గత ఎన్నికల్లో పవన్‌ టీడీపీకి సపోర్ట్‌ ఇచ్చిన నేపథ్యాన్ని వాడుకుంటూ రాసిన క్యారెక్టర్‌లో ఆలీ ఎందుకు నటించినట్టు? పవన్‌ అంటే నిన్న ఆలీ వెన్నుపోటు గురించి బయట పడ్డాడు. మరి ఆలీ ఈ సినిమా ఎప్పుడో చేసాడు కదా? గుండెల్లో ఉన్న పవన్‌కళ్యాణ్‌ జేబులో లేడా? జేబులో పడే డబ్బుల కోసం గుండెల్లో వున్న వాడిని కామెడీ చేసినా ఫర్వాలేదా? ఈ ప్రశ్నలు సంధిస్తోన్న జన సైనికుల కోసం ఆలీ మరో వీడియో విడుదల చేయాల్సివస్తుంది కావచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here