ఇంటర్మీడియెట్ నుంచే నిరుద్యోగ భృతి ఇస్తాం.. బాబు సంచలన ప్రకటన

0
158

ఏపీ లోని నిరుద్యోగులకు ఇప్పటికే భృతి ఇస్తూ విద్యార్థుల సంక్షేమంలో కీలకంగా మారిన చంద్రబాబు నాయుడు తాజాగా మరో సంచలన ప్రకటన చేశారు. భవిష్యత్ లో ఇంటర్ పూర్తి చేసిన ప్రతీ ఒక్కరికీ నిరుద్యోగ భృతి అందజేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. చిత్తూరు జిల్లా చంద్రగిరిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు మాట్లాడుతూ, తాను ఏం పని చేసినా పేదలను దృష్టిలో పెట్టుకునే చేస్తానని, గర్భిణుల వైద్యం, మందుల ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని, రైతులకు శాశ్వతంగా పెద్దన్నగా ఉంటానని, వ్యవసాయానికి భవిష్యత్తులో 12 గంటలపాటు కరెంటు ఇస్తామని హామీ ఇచ్చారు. ఏపీలో ఎక్కడ చూసినా చంద్రన్నే కులం, టీడీపీనే మతం అనేలా ఉందని అన్నారు. ఈ ఎన్నికల్లో జగన్ కు మద్దతుగా ఉన్న కేసీఆర్ డబ్బులు పంపారని, వాటిని పంచాలని చూస్తున్నారని, ఆ పాపిష్టి డబ్బును తీసుకోవద్దని ప్రజలకు సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here