ఈడీ ఎదుట హాజరైన సుజనా చౌదరి

0
383

టీపీపీ నేత, రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి సుజనాచౌదరి నేడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఎదుట హాజరయ్యారు. ఆయనను దాదాపు 5 గంటల పాటు పలు అంశాలపై విచారణ నిర్వహించారు. ఆయన బ్యాంకులను రూ.5,700 కోట్లకు మోసం చేశారన్న ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.

నవంబర్ 24న ఆయన నివాసం, కంపెనీల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. అనంతరం విచారణకు హాజరు కావాలని 27న సమన్లు జారీ చేశారు. ఈడీ సమన్లను రద్దు కోసం సుజనా చౌదరి సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఫలితం దక్కలేదు. ఈడీ ఎదుట హాజరుకావాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన నేడు ఈడీ ఎదుట హాజరయ్యారు. చెన్నైలోని ఈడీ కార్యాలయంలో ఈడీ సుజనా చౌదరిని విచారించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here