ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయడంలో వెనుకాడం: త్రివిధ దళాధిపతులు

0
544

ఢిల్లీ: నేడు త్రివిధ దళాధిపతులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బుధవారం పాక్.. భారత భూభాగంలోకి చొరబడటం.. వాటిని భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టడం.. అభినందన్ పాక్ చేతికి చిక్కడం సహా పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ‘‘బుధవారం ఉదయం 10 గంటలకు 24 పాక్‌ యుద్ధ విమానాలు  భారత భూభాగంలోకి ప్రవేశించాయి. వాటిని ఎయిర్‌ఫోర్స్‌ అధికారులు, మన యుద్ధ విమానాలు వాళ్ల ప్రయత్నాలను తిప్పికొట్టాయి. అభినందన్‌ ప్యారాచూట్‌ ఆక్రమిత కశ్మీర్‌లో పడటంతో.. ఆయనను పాక్ తమ అదుపులోకి తీసుకుంది. ఎయిర్‌ఫోర్స్‌ సమాచారాన్ని వక్రీకరించేందుకు పాక్‌ ప్రయత్నించింది.
ముందుగా రెండు విమానాలు కూలిపోయాయని చెప్పింది. పాకిస్థాన్‌ ఉద్దేశపూర్వకంగా ఖాళీ ప్రదేశాల్లో బాంబులు వేసింది. పాక్‌ ఎఫ్‌-16లు వాడినట్లు ఆధారాలు ఉన్నాయి. భారత భూభాగంలోనే పాక్‌ విమాన శకలాలు పడ్డాయి.

ఎలాంటి ఉపద్రవాలనైనా ఎదుర్కొనేందుకు వాయుసేన సిద్ధం

 అభినందన్‌ను విడుదల చేస్తామన్న ప్రకటనను ఆహ్వానిస్తున్నాం. పాక్‌ ఆర్మీ నిత్యం కాల్పులకు తెగబడుతోంది. భారత ఆర్మీ అధికారులు మన మిలటరీ స్థావరాలపై దాడులకు ప్రయత్నించారు.
బెటాలియన్‌ హెడ్‌క్వార్టర్‌ను టార్గెట్‌ చేశారు. ఆర్మీ అధికారులు ఆధీన రేఖ వెంబడి నిఘాను పటిష్టం చేశాం. ఆర్మీలోని సాంకేతిక నిపుణులను సిద్ధంగా ఉంచాం. ఆర్మీ అధికారులు
ఇప్పటికీ శాంతికే కట్టుబడి ఉన్నాం’’ అని వాయుసేన తెలిపింది. 

ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకైనా సిద్ధం: భారత నేవీ 

‘‘సమర్థమైన, శక్తిమంతమైన సమాధానం ఇచ్చేందుకు వెనుకాడం. మేము అడ్డుకోవడం వల్లే ఆర్మీ స్థావరాలపై బాంబులు వేయలేకపోయారు. ఉగ్రవాద శిబిరాలను టార్గెట్‌ చేయడంలో వెనుకాడబోము. వాటిని ధ్వంసం చేసేవరకు నిద్రపోం. రెచ్చగొడితే బుద్ధిచెప్పేందుకు సిద్ధంగా ఉన్నాం. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశాం. ఎంత మంది చనిపోయారో ఇప్పుడే చెప్పలేము. ఎమరాన్‌ క్షిపణి శకలాలు రాజౌరీ సెక్టార్‌లో పడ్డాయి. ఎఫ్‌-16లు మాత్రమే ఎమరాన్‌ క్షిపణుల్ని మోసుకెళ్లగలవు. ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన సాక్ష్యాధారాలు ఉన్నాయి. వాటిని ఎప్పుడు బయటపెట్టాలో ప్రభుత్వం నిర్ణయిస్తుంది. జెనీవా ఒప్పందం ఆధారంగానే.. అభినందన్‌ను విడుదల చేస్తున్నట్లు భావిస్తున్నాం’’ అని తెలిపారు. ఈ సందర్భంగా పాక్‌ ప్రయోగించిన ఎమరాన్‌ క్షిపణి శకలాలను.. భారత వాయుసేన.. మీడియాకు చూపించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here