ఉప్పల్‌లో హుషారుగా కదులుతున్న కారు

0
290

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హడావిడి రోజు రోజుకూ ఊపందుకుంటోంది. సెకను కాలం కూడా వృధా చేయకుండా.. తమ తమ పార్టీల ప్రచారంలో పార్టీ నేతలంతా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ పార్టీ పెద్దలు జోరుగా కారు ప్రచారాలు చేస్తూ.. తమ ప్రభుత్వం చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలను, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు. ఓ వైపు నియోజక వర్గాలన్నీ తిరుగుతూ కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొంటుంటే.. మరోవైపు కేటీఆర్ రోడ్ షోస్ ద్వారా ప్రజానీకాన్ని ఆకట్టుకుంటున్నారు.

ఈ మేరకు ఉప్పల్ నియోజక వర్గంలో రేపు జరిగే కేసీఆర్ బహిరంగ సభ ఎలా విజయవంతం చేయాలనే దానిపై ముందస్తు మీటింగ్ పెట్టుకొని.. ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డికి మద్దతుగా నాచారం 6వ డివిజన్ అధ్యక్ష్యులు మేడల మల్లిఖార్జున్ గౌడ్, కాంటెస్టడ్ కార్పొరేటర్ మేడల జ్యోతి మల్లిఖార్జున్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ప్రచార పాదయాత్ర నిర్వహించారు. ఇంటింటికీ తిరిగి ఓట్లు అభ్యర్థించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here