ఏపీకి గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం

0
514

కేంద్రం.. ఏపీకి గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నాళ్లుగానో ఏపీ వాసులు ఎదురు చూస్తున్న విశాఖకు రైల్వే జోన్‌ను నేడు ప్రకటించింది. బుధవారం సాయంత్రం కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ఈ మేరకు మీడియా ద్వారా అధికారిక ప్రకటన చేశారు. గత ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ తిరుపతి పర్యటనలో భాగంగా.. ఏపీకి ప్రత్యేక హోదా, విశాఖకు రైల్వే జోన్, కడపకు ఉక్కు ఫ్యాక్టరీ ఇస్తామని హామీ ఇచ్చారు. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ మూడు ఇవ్వలేమని కేంద్రం స్పష్టం చేసింది.

మార్చి 1న ప్రధాని మోదీ విశాఖలో పర్యటించనున్నారు. ఆయన పర్యటనకు రెండురోజుల ముందు కేంద్రం విశాఖకు రైల్వే జోన్ ప్రకటించడం గమనార్హం. దీనిపై విభజన హామీల సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్‌ స్పందించారు. విశాఖకు కేంద్ర ప్రభుత్వం రైల్వేజోన్ ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. 2014 నుంచి విభజన హామీల కోసం పోరాడుతున్నామని తెలిపారు. రాజకీయ క్రీడలో భాగంగానే ఆఖరి క్షణంలో రైల్వేజోన్ ప్రకటించారని.. మిగతా హామీలు కూడా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here