ఏపీలో గెలుపెవరిదో ఎగ్జిట్స్ పోల్స్ తేల్చేశాయ్!

Exit poll results 2019 Andhra Pradesh: Verdict split between YSR Congress and TDP

0
73

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ముగిసిన అనంతరం ఏ పార్టీ గెలుస్తుంది..? ఏ పార్టీ ప్రతిపక్షంలో కూర్చోబోతోంది..? అనేదానిపై తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారిలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. దేశ వ్యాప్తంగా జరిగిన ఎన్నికలు ఆదివారం అనగా మే-19తో ముగిశాయి. ఇక పోలింగ్ అటు ముగిసిందో లేదో పార్టీల భవిష్యత్తు చెప్పే జ్యోతిష్యురాయుళ్లు రంగంలోకి దిగి కేంద్రంలో ఫలానా పార్టీ వస్తుంది..? ఏపీలో ఫలానా పార్టీ గెలుస్తుందని లెక్కలేసి చెప్పేశారు. అంతేకాదు.. ఈసారి తాము చేసిన సర్వే ఫెయిలయితే రానున్న ఎన్నికల్లో సర్వే చేయను గాక చేయనంటూ శపథాలు చేస్తున్నారు కూడా. అయితే ఆ సర్వేలు సక్సెస్ అవుతాయో..? అట్టర్ ప్లాప్ అవుతాయో అనేది తెలియాలంటే మే-23న ఈవీఎంలు తెరిచి లెక్కించే వరకు వేచి చూడాల్సిందే మరి.. ఇవే ఫైనల్ సర్వే ఫలితాలు.

ఇక ఆంధ్రప్రదేశ్‌లోని పార్టీల విషయానికొస్తే.. 2014 ఎన్నికల్లో జస్ట్ మిస్సయిన సీఎం సీటును ఈసారి ఎలాగైనా కైవసం చేసుకోవాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శాయశక్తులా ప్రయత్నాలు చేసి.. 2019 ఎన్నికల్లో గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేస్తు్న్నారు. మరోవైపు టీడీపీ సైతం తాము చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు రెండోసారి అధికారం కట్టబెడుతాయని ఫుల్ కాన్ఫిడెన్స్‌లో ఉన్నారు. ఏపీలో ప్రధాన పార్టీలే రెండే రెండు.. వైసీపీ, టీడీపీ. జనసేన పోటీ చేసినప్పటికీ ఎన్నికల సీజన్ మొదలవ్వగానే సీన్ మొత్తం కళ్లకు కట్టినట్లు ఆ పార్టీ అధినేత, నేతలకు కనపడింది.!. ఇక ఎలాగో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఆంధ్రప్రదేశ్‌లో 2014 కంటే ముందే అడ్రస్ గల్లంతు చేసుకున్నాయి. ఇది ఏపీలో పరిస్థితి. సర్వే ఫలితాల విషయానికొస్తే జాతీయ, ప్రాంతీయ మీడియా సంస్థలు ఏపీలో గెలుపెవరిదో.. ప్రతిపక్షంలో కూర్చునేదెవరో తేల్చేశాయి.

టీడీపీ విషయానికొస్తే..
జాతీయ, ప్రాంతీయ మీడియా సంస్థలు, పలు ప్రముఖ సర్వే సంస్థలు ప్రీ, పోస్ట్, ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడించాయి. కేంద్రంలో మళ్లీ బీజేపీదే అధికారమని తేల్చేశాయి. ఏపీలో మళ్లీ టీడీపీదే అధికారమని ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి, ఎలైట్‌తో పాటు కొన్ని సర్వే సంస్థలు స్పష్టం చేశాయి. అయితే జాతీయ మీడియా సంస్థలు గానీ.. జాతీయ సర్వే సంస్థలు గానీ రెండోసారి టీడీపీ గెలుస్తుందని ఎక్కడా చెప్పకపోవడం గమనార్హం. ప్రాంతీయ మీడియాలో వైసీపీ హవా లేదని చెప్పినప్పటికీ.. జాతీయ మీడియా సంస్థలైన ఇండియా టుడే, సీపీఎస్‌తో పాటు పలు సర్వే సంస్థలు.. ఈసారి ఏపీలో ఫ్యాన్ గాలి గట్టిగా వీచిందని.. వైఎస్ జగన్ ఎవరి మద్దతూ లేకుండా గెలిచిపోతారని తేల్చేశాయి.

:- లగడపాటి సర్వే:-
టీడీపీ 100 (+/-) 10
వైసీపీ 72 (+/-) 7
ఇతరులు 03 (+/-) 2

పార్లమెంట్‌ స్థానాలు
టీడీపీ 15 (+/-) 2
వైసీపీ 10 (+/-) 2
ఇతరులు 1

:- ఎలైట్‌ సర్వే:-
అసెంబ్లీ సీట్లు…
టీడీపీ : 106 స్థానాలు
వైసీపీ : 68 స్థానాలు
జనసేన : 01 స్థానాలు

ఎంపీ సీట్లు…
టీడీపీ : 17-18 స్థానాలు
వైసీపీ : 8-9 స్థానాలు

:- ఇండియా టుడే సర్వే ప్రకారం:-
వైసీపీ : 130-135 సీట్లు
టీడీపీ : 37-40 సీట్లు
జనసేన : 0-01 సీట్లు

:- సీపీఎస్ సర్వే ప్రకారం:-
వైసీపీ : 130-133 సీట్లు
టీడీపీ : 43-44 సీట్లు
జనసేన : 0-01 సీట్లు

తెలంగాణలో అట్టర్ ప్లాప్ అయిన ఆక్టోపస్ సర్వే.. ఏపీలో ఏ మాత్రం వర్కవుట్ అవుతుందో వేచి చూడాల్సిందే. అయితే ఈసారి సర్వే ఫలితాలు వెల్లడించడమే కాదు.. ఏపీలో సర్వే ఫెయిల్ అయితే ఇదే చివరి సర్వే అని.. ఇక మీదట చేయనని చెప్పుకొచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here