ఏపీ ఎన్నికల ఫలితాలపై ‘రణరంగం’.. మినిట్ టూ మినిట్ అప్డేట్స్

0
83

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నేడు 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాల లెక్కింపు కోసం రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో 36 చోట్ల 55 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. మరికొన్ని గంటల్లో ఏపీలో ట్రెండింగ్స్ తెలిసిపోనున్నాయి. ఇదిలా ఉంటే ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. మరోవైపు కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు.

గురువారం ఉదయం సరిగ్గా 8 గంటలకు ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్లు, తదుపరి సర్వీసు ఓటర్ల లెక్కింపుతో కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలకు సంబంధించి లైవ్ అప్‌డేట్స్ కోసం మినిట్ టూ మినిట్ మీకోసం అందిస్తోంది www.ranarangam.com.

*పోస్టల్‌ బ్యాలెట్‌: కడప పార్లమెంట్‌, కమలాపురంలో వైసీపీ ఆధిక్యం

*అనంతపురం-సింగనమల పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో వైసీపీ అభ్యర్థి జొన్నలగడ్డ పద్మావతి ముందంజ…రెండో స్థానం లో టీడీపీ.

*అనంతపురం: గుంతకల్లు పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో వైఎస్సార్ సీపీ అభ్యర్థి వై.వెంకట్రామిరెడ్డి ముందంజ

*అనంతపురం అర్బన్ నియోజకవర్గం పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో వైఎస్సార్ సీపీ అభ్యర్థి అనంతవెంకట్రామిరెడ్డి ఆధిక్యత..

*పగో: ఏలూరు, భీమవరం కౌంటింగ్ కేంద్రాల్లో ఇవియంల లెక్కింపు ప్రారంభం

*విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం..
తొలి రౌండ్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి 255 ఓట్లు ఆధిక్యం

*చిత్తూరు..
చంద్రగిరి నియోజకవర్గం కౌంటింగ్ హాల్లో ఏజెంట్లు కూర్చోవడానికి సరిపడ కూర్చీలు లేకపోవడంతో వివిధ పార్టీలకు చెందిన ఏజెంట్లు మద్య వాగ్వివాదం.ఎన్నికల అధికారులను నిలదీసిన ఏజెంట్లు.

*విజయనగరం:
విజయనగరం ఎమ్మెల్యే ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్ లో వైసిపి అభ్యర్థి కోలగట్లకు 255ఓట్ల ఆధిక్యం

*విశాఖ : అనకాపల్లి నియోజకవర్గం లో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు లో స్వల్ప ఆధిక్యంలో వున్న వైసిపి అభ్యర్థి గుడివాడ అమర్‌నాథ్

*మంగళగిరి పోస్టల్‌ బ్యాలెట్‌లో లోకేష్‌ ఆధిక్యం

*మైదుకూరులో వైసీపీ ఆధిక్యం

*అనంతపురం లోక్‌సభ స్థానంలో వైసీపీ ఆధిక్యం

*మైదకూరు తొలి రౌండ్‌లో వైసీపీ 1192 ఓట్ల ఆధిక్యం

*విజయనగరం అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి వీరభద్రస్వామి 255 ఓట్లు లీడ్

*అమలాపురం పార్లమెంట్‌లో వైసీపీ 851 ఓట్ల ఆధిక్యం

*అనకాపల్లిలో వైసీపీ అభ్యర్థి అమర్నాథ్‌ ఆధిక్యం

*గుంటూరు పశ్చిమలో వైసీపీ ఆధిక్యం

*మంగళగిరిలో నారా లోకేష్‌ ఆధిక్యం

*కడప: బద్వేలు తొలి రౌండ్‌లో టీడీపీ 246 ఓట్ల ఆధిక్యం

*పెద్దాపురంలో టీడీపీ 249 ఓట్లు లీడ్

*నెల్లూరు పార్లమెంట్‌లో వైసీపీ 2435 ఆధిక్యం

*కడప : కమలాపురం ఫస్ట్ రౌండులో వైసిపి ముందంజ..936 ఆధిక్యత

మొదటి రౌండ్లో చోడవరం వైసిపి 1800 మెజార్టీ

నెల్లిమర్ల వైసిపి అభ్యర్ధి బి.అప్పలనాయుడు తొలి రౌండ్ లో నాలుగు వేలు ఆధిక్యం

శ్రీకాకుళం.. పాలకొండలో మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి వైసీపీ 1422 ఓట్లు ఆధిక్యం

ఇచ్చాపురం ఫస్ట్ రౌండ్ వైసీపీ అభ్యర్థి పిరియా సాయిరాజు ఆధిక్యం (1080)

మచిలీపట్నం, అవనిగడ్డ, పెడన కైకలూరు నూజివీడు నియోజకవర్గలలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కింపు లో వైకాప ఆదిక్యత…

ప్రకాశం : కొండేపి అసెంబ్లీ నియోజకవర్గం మొదటి రౌండ్ లో టీడీపీ 344 ఓట్ల ఆధిక్యం..

పగో: పోలవరంలో వైసీపీ అభ్యర్థి తెల్లం బాలరాజు ముందంజ

పగో: దెందులూరులో వైసీపీ అభ్యర్థి అబ్బాయి చౌదరి మొదటి రౌండులో ముందంజ

గుంటూరు: పొన్నూరు లో తొలి రౌండ్ లో టిడిపి 521 ఆధిక్యం.

పత్తిపాడులో తొలి రౌండ్ లో వైసిపి 2115 ఓట్లు ఆధిక్యం

ఆళ్లగడ్డలో వైస్సార్సీపీ అభ్యర్థి గంగుల బ్రిజంద్రా రెడ్డి ముందంజ

కర్నూల్ జిల్లా YSRCP డోన్ అసెంబ్లీ అభ్యర్థి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 10టేబుల్స్ గాను 1వరౌండ్ లో 1138 YSrCp మెజారిటీ

గుడివాడ పోస్టల్ బ్యాలెట్ ఒట్లు లెక్కింపులో వైకాపా ఆదిక్యం..

కుప్పంలో 67 ఓట్ల మెజారిటీ తో వైసీపీ. మొదటి రౌండ్ పూర్తి

ధర్మవరం ఒకటవ రౌండ్ ఆదిక్యత 2195 వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి

పార్వతీపురంలో వైసిపి అభ్యర్ధి తొలి రౌండ్ లో 188ఆధిక్యం. మొరాయించిన రెండు ఇవిఎం లు.

రాజానగగరం తొలిరౌండ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి జక్కంపూడి రాజా 984 ఆదిక్యం

ప్రకాశం : కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గం మొదటి రౌండ్‌లో వైసీపీ 285 ఓట్ల ఆధిక్యం..

ఎర్రగొండపాలెం అసెంబ్లీ నియోజకవర్గం మొదటి రౌండ్‌లో వైసీపీ 1660 ఓట్ల ఆధిక్యం…

గుంటూరుః సత్తెనపల్లి అసెంబ్లీ తొలి రౌండ్ లో వైసిపి ముందంజ

==========================

కర్నూలులో 13 చోట్ల వైసీపీ, ఒక చోట టీడీపీ లీడ్

కడప జిల్లాలో అన్ని స్థానాల్లో వైసీపీ ఆధిక్యం

ప్రకాశం జిల్లాలో టీడీపీ 4, వైసీపీ 8 స్థానాల్లో లీడ్

చిత్తూరు జిల్లాలో 13 వైసీపీ, ఒక స్థానంలో టీడీపీ లీడ్

అనంతపురం జిల్లాలో 12 వైసీపీ, రెండు స్థానాల్లో టీడీపీ లీడ్‌

నెల్లూరు, విజయనగరం జిల్లాలో అన్ని స్థానాల్లో వైసీపీ ఆధిక్యం

శ్రీకాకుళంలో 9 స్థానాల్లో వైసీపీ, ఒక స్థానంలో టీడీపీ ఆధిక్యం

ప.గో. జిల్లాలో 12 స్థానాల్లో వైసీపీ, 3 స్థానాల్లో టీడీపీ ఆధిక్యం

గుంటూరు జిల్లాలో 12 స్థానాల్లో వైసీపీ, 5 చోట్ల టీడీపీ ఆధిక్యం

కృష్ణా జిల్లాలో 9 చోట్ల వైసీపీ, ఏడుచోట్ల టీడీపీ ఆధిక్యం

విశాఖ జిల్లాలో 10 చోట్ల వైసీపీ, 4 చోట్ల టీడీపీ ఆధిక్యం

తూ.గో. జిల్లాలో 15 స్థానాల్లో వైసీపీ, 4 స్థానాల్లో టీడీపీ ఆధిక్యం

కర్నూలు: నందికొట్కూరులో 1362 ఓట్లతో వైసీపీ లీడ్‌

కర్నూలులో 6961 ఓట్ల ఆధిక్యంలో వైసీపీ

ఆళ్లగడ్డలో 770 ఓట్లతో వైసీపీ ముందంజ

కర్నూలు: ఆదోనిలో 866 ఓట్ల ఆధిక్యంలో వైసీపీ

విశాఖ: గాజువాకలో పవన్‌ కల్యాణ్‌ ముందంజ

అనంతపురం: పుట్టపర్తిలో 4489 ఓట్లతో వైసీపీ ముందంజ

నరసన్నపేట మూడో రౌండ్‌లో 882 ఓట్లతో వైసీపీ ముందంజ

అనంతపురం: ధర్మవరంలో 6145 ఓట్లతో వైసీపీ ఆధిక్యం

అనంతపురం: సింగనమలలో 6100 ఓట్లతో వైసీపీ ఆధిక్యం

కర్నూలు: నంద్యాల 1400 ఓట్లతో వైసీపీ ఆధిక్యం

కర్నూలు: పత్తికొండలో 1848 ఓట్లతో వైసీపీ ఆధిక్యం

కర్నూలు: శ్రీశైలం 4581 ఓట్లతో వైసీపీ ఆధిక్యం

విశాఖ: మాడుగులలో 2500 ఓట్లతో వైసీపీ ఆధిక్యం

శ్రీకాకుళం: ఆముదాలవలసలో 332 ఓట్లతో టీడీపీ ముందంజ

శ్రీకాకుళం: ఎచ్చెర్లలో 2410 ఓట్లతో వైసీపీ ఆధిక్యం

=================================

మచిలీపట్నం పార్లమెంట్ 4 వ రౌండ్ ముగిసేసరికి

వైసీపీ అభ్యర్థి ఓట్లు 67583, టీడీపీ అభ్యర్థి ఓట్లు 57706, జనసేన ఓట్లు 14164

9877 ఓట్లతో వైసీపీ అభ్యర్థి వల్లభనేని బాలసౌరి అధిక్యం

పామర్రు:  4 వ రౌండ్ పూర్తి అయ్యేసరికి వైసీపీ 22334, టీడీపీ 14038 ఓట్లు

వైసీపీ అభ్యర్థి కైలే అనిల్ కుమార్ 8296 ఓట్ల అధిక్యం

పెనమలూరు: 4 వ రౌండ్ ముగిసేసరికి వైసీపీ అభ్యర్థి 19977, టీడీపీ అభ్యర్థి 16588

వైసీపీ అభ్యర్థి కొలుసు పార్థసారథి 3389 ఓట్లతో అధిక్యం

===========================

పామర్రు లో టీడీపీ అభ్యర్థి ఉప్పులేటి కల్పన పై వైసీపీ అభ్యర్థి కైలే అనిల్ కుమార్ 21118 ఆధిక్యం

నూజివీడు టీడీపీ అభ్యర్థి ముద్దరబోయిన వెంకటేశ్వరరావు పై వైసీపీ అభ్యర్థి మేక వెంకట ప్రతాప్ అప్పారావు 3095 ఆధిక్యం

బందరు టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర పై వైసీపీ అభ్యర్థి పేర్ని నాని 3543 ఆధిక్యం

గుడివాడ టీడీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ పై వైసీపీ అభ్యర్థి కొడాలి నాని 5380 ఆధిక్యం

గన్నవరం వైసీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు పై టీడీపీ అభ్యర్థి వల్లభనేని వంశీమోహన్ 2693 ఓట్ల ఆధిక్యం

పెడన టీడీపీ అభ్యర్థి కాగిత కృష్ణ ప్రసాద్, జనసేన అంకె లక్ష్మీ శ్రీనివాస్ లపై వైసీపీ అభ్యర్థి జోగి రమేష్ ముందంజ

అవనిగడ్డ టీడీపీ అభ్యర్థి మండలి బుద్ధ ప్రసాద్ పై వైసీపీ అభ్యర్థి సింహాద్రి రమేష్ 5559 ఆధిక్యం

కైకలూరు వైసీపీ అభ్యర్థి దూలం నాగేశ్వరరావు పై టీడీపీ అభ్యర్థి జయమంగల వెంకటరమణ 853 ఓట్ల ఆధిక్యం

పెనమలూరు టీడీపీ అభ్యర్థి బోడె ప్రసాద్ పై వైసీపీ అభ్యర్థి కొలుసు పార్థసారథి 2501 ఓట్ల ఆధిక్యం

మచిలీపట్నం పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి టీడీపీ అభ్యర్థి అయిన కొనకళ్ల నారాయణరావు పై 17959 ఓట్ల అధిక్యం లో ఉన్నారు

మొత్తం మచిలీపట్నం, కృష్ణా యూనివర్సిటీ లో ఉన్న 9 నియోజకవర్గాలలో కైకలూరు మినహా వైసీపీ ఆధిక్యం

================================

విశాఖ జిల్లాలో 4 చోట్ల టీడీపీ, 11 చోట్ల వైసీపీ ఆధిక్యం

గాజువాకలో పవన్‌కళ్యాణ్‌ వెనుకంజ
టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు 399 ఓట్ల ఆధిక్యం

సత్తెనపల్లిలో కోడెల వెనుకంజ
సత్తెనపల్లిలో వైసీపీ అభ్యర్థి 4356 ఓట్ల ఆధిక్యం

పీలేరులో టీడీపీ అభ్యర్థి కిషోర్‌కుమార్‌రెడ్డి 296 ఓట్ల ఆధిక్యం

ఆళ్లగడ్డలో అఖిలప్రియ, ఎచ్చెర్లలో కళా వెంకట్రావు వెనుకంజ
సత్తెనపల్లిలో కోడెల, మైలవరంలో దేవినేని ఉమ వెనుకంజ

పులివెందులలో జగన్‌ 23,834 ఓట్ల ఆధిక్యం

గన్నవరంలో వైసీపీ 728 ఓట్ల ఆధిక్యం

బెంగళూరు సౌత్‌లో బీజేపీ అభ్యర్థి తేజస్వికి లక్ష ఓట్ల ఆధిక్యం
ఈ లోక్‌సభ ఎన్నికల బరిలో ఉన్న అతి పిన్న వయస్కుడు తేజస్వి(28)

చిలకలూరిపేటలో వైసీపీ 470 ఓట్ల ఆధిక్యం
రాజోలులో జనసేన 115 ఓట్ల ఆధిక్యం

అనకాపల్లి పార్లమెంట్‌లో వైసీపీ 1051 ఓట్ల ఆధిక్యం

దెందులూరులో చింతమనేని ప్రభాకర్ వెనుకంజ
దెందులూరులో వైసీపీ అభ్యర్థి 7 వేల ఓట్ల ఆధిక్యం

అరకు పార్లమెంట్‌ వైసీపీ 21,185 ఓట్ల ఆధిక్యం

విజయవాడ తూర్పులో టీడీపీ 4408 ఓట్ల ఆధిక్యం
మంత్రాలయంలో వైసీపీ 5605 ఓట్ల ఆధిక్యం
తాడిపత్రిలో వైసీపీ 2382 ఓట్ల ఆధిక్యం

హిందూపురంలో బాలకృష్ణ ఆధిక్యం
ఉరవకొండలో పయ్యావుల కేశవ్ ఆధిక్యం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here