‘ఐఐటీ కృష్ణమూర్తి’ ఫస్ట్ లుక్ అదిరింది

prudhvi dandamuri and maira doshi are playing the lead roles in iit krishnamurthy

0
709

పృథ్వీ దండమూడి, మైరా దోషి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఐఐటీ కృష్ణమూర్తి’. కార్పొరేట్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నూతన దర్శకుడు శ్రీ వర్ధన్ దర్శకత్వం వహిస్తున్నారు. వినూత్నమైన కథా కథనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుండగా, తాజాగా ఫస్ట్ లుక్‌ని విడుదల చేసింది చిత్ర బృందం. ఈ లుక్‌లో ‘మిస్సింగ్- లాస్ట్ సీన్ సాటర్ డే ఈవినింగ్’ అనే క్యాప్షన్స్, సినిమాపై మంచి ఇంట్రెస్ట్‌ను కలిగిస్తున్నాయి. ఇంకా ఈ పోస్టర్ లో సీరియస్ లుక్ లో హీరో కనిపిస్తూ ప్రేక్షకులలో ఎంతో క్యూరియాసిటీ కలిగిస్తున్నారు. వినయ్ వర్మ, భారతి ఆనంద్, బెనర్జీ, కమెడియన్ సత్య ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా టీజర్‌ను ఫిబ్రవరి 24న రిలీజ్ చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. వేసవి కానుకగా మే 28న ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకి నరేష్ కుమారన్ సంగీతం సమకూరుస్తుండగా, యేసు పి సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. ప్రేమ్ కుమార్ పాత్ర సమర్పిస్తున్న ఈ సినిమాని క్రిస్టోలైట్ మీడియా క్రియేషన్స్ బ్యానర్ పతాకంపై ప్రసాద్ నేకూరి నిర్మిస్తున్నారు.

పృథ్వీ దండమూడి, మైరా దోషి, వినయ్ వర్మ, భారతి ఆనంద్, బెనర్జీ, కమెడియన్ సత్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి
సాంకేతిక నిపుణులు :
దర్శకుడు: శ్రీ వర్ధన్
సమర్పణ: ప్రేమ్ కుమార్ పాత్ర
నిర్మాత: ప్రసాద్ నేకూరి
బ్యానర్: క్రిస్టోలైట్ మీడియా క్రియేషన్స్
ఎక్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : శ్రీ క్రిష్
సినిమాటోగ్రఫీ: యేసు.పి
సంగీతం: నరేష్ కుమారన్
ఎడిటర్: అనిల్ కుమార్.పి
రచన: నాగార్జున మనపాక
గీత రచయిత: రామాంజనేయులు సంకర్పూ
లైన్ ప్రొడ్యూసర్: ఎల్.వి. వాసుకి
ప్రొడక్షన్ కంట్రోలర్: అశ్విన్, ఆనంద్ కుమార్
క్యాస్టింగ్: సూర్య తేజ
కలరిస్ట్: శ్రీనివాస్ మామిడి
పి.ఆర్.ఓ: సాయి సతీష్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here