ఒకవేళ యుద్ధమే చేయాల్సి వస్తే..: జేసీ

0
542

పాకిస్తాన్ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ తమ వద్ద బందీగా ఉన్న భారత్ జవాన్ అభినందన్ రేపు భారత్‌కు అప్పగిస్తామని అని చెప్పడం పట్ల అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. తమ దేశ రక్షణ రహస్యాలను శత్రు దేశమైన పాకిస్థాన్‌కు వెల్లడించకుండా.. ధైర్యంగా నిలబడ్డాడని అభినందన్‌కు, అలాగే ఆయనను విడుదల చేస్తున్న ఇమ్రాన్ ఖాన్ కు అభినందనలు తెలిపారు. యుద్ధం భారత అంతర్గత కుట్ర అని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చెప్పడాన్ని తాను నమ్మలేదన్నారు.

ఒకవేళ పుల్వామా దాడి వెనుక ఏవైనా అదృశ్య శక్తులు ఉంటే క్షమించ రాదని చెప్పారు. యుద్ధం అనివార్యం అయితే ఇరు దేశాలు చాలా నష్టపోతాయన్నారు. భారతదేశం రచన విభాగంలో లక్షలాది కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని, ఆ డబ్బు మరో మార్గంలో వాడితే కశ్మీర్ టు కన్యాకుమారి వరకు ప్రతి ఎకరాకు సాగునీరు అందించవచ్చన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అనంతపురంపై బాంబులు పడినా ఆశ్చర్యపోనక్కర్లేదన్నారు. యుద్ధమే చేయాల్సి వస్తే.. కశ్మీర్ రాజు పరిపాలించిన ప్రాంతమంతటినీ భారత్‌లో కలుపుకునేంత వరకు పోరాడాలన్నారు.

రైల్వే జోన్‌పై జేసీ మాట్లాడుతూ..

అమిత్ షా రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు ఖాళీ కుర్చీలు స్వాగతం పలికాయని.. అలాగే
ప్రధాని మోదీ గుంటూరుకు వచ్చిన అదే ఖాళీ కుర్చీలు స్వాగతించాయన్నారు. ఆయన వచ్చే ముందు రైల్వే జోన్ ప్రకటించి శ్రీకాకుళం వస్తున్నారన్నారు. విశాఖ రైల్వే జోన్ ప్రకటించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నామని జేసీ వ్యాఖ్యానించారు. కానీ మెలికల పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామన్నారు. ఒక పూట సంతకం చేసి ప్రత్యేక హోదా ఇచ్చేస్తే పోయేదానికి.. రాష్ట్రం పట్ల మోదీ కపట ప్రేమను ప్రదర్శిస్తున్నాడన్నారు. బీజేపీకి గత ఎన్నికల్లో ఒకటో.. అరో సీట్లు వచ్చాయని… ఈసారి అది కూడా జరగదన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here