కామెడీ పండించమంటే.. ఈ కామమేంటి!

why directing these type of movies in tollywood

2
955

“కామా తురాణం నా భయం నా లజ్జ” అనే విషయం మనందరం చాలా సార్లు వినే ఉంటాం. దీనికి అర్థం ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు సినిమాలు ఎలా ఉండేవి..? ఎలాంటి కథలుండేవి.. థియేటర్లలో ఆడేవి..? మరి ఇప్పుడు కూడా కథలేగా.. ఇప్పుడు కూడా సినిమా థియేటర్లలోనేగా రిలీజ్ అయ్యేది.. ఎందుకు అన్నీ సక్సెస్ కాలేకపోతున్నాయ్.. పెద్ద పెద్ద కథలున్నా సినిమాలు థియేటర్లలో నుంచి వెనుదిరుగుతున్నాయ్..? కామెడీ, కామంతో కూడిన సినిమాలు ఎందుకు హిట్టవుతున్నాయ్. అసలు ఈ ‘కామం’ అనే కాన్సెప్ట్ లేకుండా స్టోరీలు దొరకవా..? కథలో దమ్ముంటే థియేర్లలోకి జనాలను పరుగులు తీయించిన సినిమాల్లేవా..? మరెందుకు ఇలాంటి చిల్లీ కాన్సెప్ట్‌‌లనే పట్టుకుని కొందరు వేలాడుతున్నట్లు..? కథలో దమ్ము లేనప్పుడు.. ఏదో మమా అనిపించేసి నాలుగు కాసులు సంపాదించేయొచ్చనే గుడ్డి అపనమ్మకంతో మూడు హాట్ సీన్స్.. ఆరు మాంచి సన్నివేశాలు అంటూ కొందరు దర్శకులు కాలం గడిపేస్తున్నారు. అసలెందుకిలా..? ఏం జరుగుతోంది..? అనేది ఇప్పుడు ఈ కథనంలో చూద్దాం.

‘బాబు బాగా బిజీ’ సినిమా మొదలుకుని ఇప్పటి వరకూ వచ్చిన.. వస్తున్న.. ట్రైలర్‌‌లు రిలీజ్ చేసిన కొన్ని మూవీస్ గురించి ఇక్కడ చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అసలు మన భారతదేశం కల్చర్ ఏంటి..? కల్చర్‌‌కు లోబడి సినిమాలు చేస్తున్నారా..? లేకుంటే కల్చర్‌‌ను పక్కనెట్టి పక్కోడి కల్చర్ తెచ్చి జనాల మీద బలవంతంగా రుద్దుతున్నారా..? అసలు తమరు తీసే సినిమాలతో సమాజంలో బతుకుతున్న జనాలకు ఏ మాత్రం ఉపయోగపడుతోంది..? ఏ మేరకు ప్రభావితం చేస్తుంది..? అలాగనీ సినిమాల వల్లే అందరూ మారిపోతున్నారు..? సినిమాల్లో ఏమైనా ఇలా చేయండి..? అలా చేయండి (కొన్ని విషయాల్లో అస్సలు చెప్పరు)అని ఎవరు చెప్పరు గాక చెప్పరు..?. అలాంటప్పుడు మంచి దమ్మున్న కథను ఆలోచించి తెరకెక్కించాల్సింది పోయి.. కామెడీ కమ్ లవ్ అని.. ఫుల్ కామెడీ ఎంటర్‌‌ట్రైనర్, కామెడీ కమ్ హర్రర్ అని ఇలా చాలా పేర్లతో సినిమాల్లో కామెడీ, స్టోరీలకు బదులు ‘కామం’ ఎక్కువగా పండిస్తున్నారు. ఇది అక్షర సత్యం.. ఈ మాట అనడంలో ఎలాంటి ఢోకా లేదు.

‘బాబు బాగా బిజీ’ సినిమా కాన్సెప్ట్ ఏంటి..? అసలు కథ ఏంటి..? అసలు ఈ సినిమాకు స్టోరీకి సంబంధం ఏమైనా ఉంటుందా..? అది పక్కనపెడితే.. ఈ మధ్య వచ్చిన ‘ఏడు చేపలు కథ’, ‘చీకటి గదిలో చితకొట్టుడు’ ‘4 లెటర్స్’ ‘వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మి’, ‘ మిర్రర్’, ‘కేఎస్100’ ఇలా చెప్పుకుంటూ పోతే చాత్తాడంత లిస్ట్‌‌ ఉంది. అసలు ఈ సినిమాలతో సభ్య సమాజానికి ఏం సందేశం ఇద్దామనుకుంటున్నారో.. ఈ డైరెక్టర్స్‌‌ అనేది వారికే ఎరుక. ట్రైలర్స్‌‌, ఫస్ట్‌‌లుక్‌‌లు, టీజర్సే ఈ రేంజ్‌‌లో ఉంటే అసలు సినిమా ఇంకేమైనా ఉంటుందా..? అసలు ఫ్యామిలీతో వెళ్లి సినిమా చూసే అవకాశం ఒక జీరో శాతమైనా ఉంటుందా..? అంటే కథల్లో క్రియేటివిటీ పుట్టించలేరా..? సంక్రాంతి పండుగకు వచ్చిన ఎఫ్‌‌2 మూవీ చూడండి ఏ రేంజ్‌‌లో ఉందో..రిలీజ్ మొదలుకుని ఇవాళ్టి వరకూ కాసుల వర్షమే కురిపిస్తోంది. ఇలాంటి ఆలోచనలు ఎందుకు రావు..? అందుకే జర జనాలు చూసే సినిమాలు తీయండయ్యా బాబు.. సమాజానికి సందేశం ఇచ్చే సినిమాలు తీయండి కానీ.. నలుగురి నోళ్లలో నలిగి తిట్ల వర్షం కురిపించుకునే సినిమాలొద్దుగాక వద్దు. మీరు మారి మంచి కథలతో జనాలను మార్చండి.. అంతేకానీ అడ్డగోలుగా కామంతో కూడిన సినిమాలు తీయకండి..! అలాంటి వాటికి వేరే సినిమాలు ఉన్నాయ్.. ఆ లెక్కలన్నీ వేరు. సో ఇకనైనా కాస్త పద్ధతిగా తీయడం నేర్చుకోండయ్యా డైరక్టర్సూ..!!

ముఖ్య గమనిక: ఇది ఎవర్నీ.. ఏ సినిమానీ టార్గెట్ చేసుకుని రాసిన ఆర్టికల్ కాదు.. సభ్య సమాజం కోసం మా వంతుగా మేం చేస్తున్న చిన్ని ప్రయత్నం మాత్రమే.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here