కేటీఆర్ రాకతో జన సంద్రంగా మారిన మల్లాపూర్ పరిసరాలు

0
311

మరికొద్ది రోజుల్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ నేత, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మల్లాపూర్ డివిజన్, ఈసీఐల్ లో పర్యటించారు. ఈ మేరకు అక్కడి ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన కేటీఆర్.. రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక జరిగిన అభివృద్ధి పనుల గురించి వివరించారు. టీఆర్ఎస్ తరఫున మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మర్రి రాజశేఖర్ రెడ్డికి మీ అమూల్యమైన ఓటును వేయాల్సిందిగా ఆయన అభ్యర్థించారు.  

కేటీఆర్ రాకతో మల్లాపూర్, ఈసీఐల్ పరిసర ప్రాంతాల్లోని జనం భారీ ఎత్తున తరలి వచ్చారు. భారీ జన సందోహం నడుమ కేటీఆర్ స్పీచ్ ఎంతో రసవత్తరంగా సాగింది. ఈ సభలో ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి, మల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి, స్థానిక టీఆర్ఎస్ నాయకులు రాపోలు సతీష్, శైలేష్ రెడ్డి, తీగుళ్ల శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here