కేటీఆర్ వాట్సాప్ నంబర్, చాట్ అన్నీ ఇవే: లగడపాటి

0
775

సీనియర్ నేత, మాజీ ఎంపీ, ఆంధ్ర ఆక్టోపస్‌‌గా పేరుగాంచిన లగడపాటి రాజగోపాల్ తన సర్వేతో తెలంగాణలో ప్రజాకూటమిదే గెలుపని మంగళవారం సాయంత్రం తేల్చిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై మాజీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. లగడపాటి చేసింది బోగస్ సర్వే అని తెలుపుతూ బండారం మొత్తం ఆధారాలతో సహా బయటపెట్టారు. ఈ నేపథ్యంలో దీనిపై స్పందించిన లగడపాటి తన వద్దనున్న ఆధారాలు, కేటీఆర్ వాట్సాప్ నెంబర్ మీడియా ముందు పెట్టడం హాట్ టాపిక్ అవుతోంది.

9490866666 నుంచి కేటీఆర్ తనతో వాట్సాప్‌లో చాటింగ్ చేశారని, అలాగే 8096699999 నంబర్ నుంచి కూడా తనతో కాంటాక్ట్ అయ్యారని లగడపాటి పేర్కొన్నారు. సర్వే రిపోర్టులు పంపిచడానికి కేటీఆర్‌ మెయిల్‌ అడ్రస్‌ కూడా ఇచ్చారని చెప్పాడు. కేటీఆర్‌ 23 నియోజకవర్గాల జాబితా పంపించి సర్వే ఫలితాలు కోరారని లగడపాటి తెలిపారు. అంతేకాకుండా నవంబర్‌ 11 వ తేదీన మరో 37 నియోజకవర్గాల జాబితా పంపారన్నారు. అయితే కేటీఆర్‌ కోరిన ఆ 37 నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ ఆధిక్యంలో ఉందని తెలిపారు. ‘మీ నాన్న గారు పాడు చేసిన వాతావరణాన్ని.. మీరు బాగు చేశారని కేటీఆర్‌కు మెసేజ్‌ చేశా’నని లగడపాటి అన్నారు. నవంబర్‌ 28 తర్వాత తనకు అనేక రిపోర్టులు వచ్చాయని, ఏ రిపోర్ట్‌ను ఎవరితో షేర్‌ చేసుకోలేదన్నారు. 8 మంది ఇండిపెండెట్లు గెలుస్తారని చెప్పనే తప్ప ఏ పార్టీకి వ్యతిరేకంగా చెప్పలేదని లగడపాటి అన్నారు.

మీ పార్టీలో 65 శాతం ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని కేటీఆర్‌కు ముందే చెప్పానని అన్నారు. ప్రజకూటమి ఏర్పాటు కాకముందే.. వారంతా కలిస్తే పెరుగుతుందని కూడా కేటీఆర్‌కు చెప్పానని తెలిపారు. వీలుంటే పొత్తులతో వెళ్లాలని చెప్పా.. అయితే కేటీఆర్‌ సింగిల్‌గానే వెళ్తామని అన్నాడని తెలిపారు లగడపాటి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here