కేసీఆర్.. ఆంధ్రా వస్తావా? రా చూద్దాం: డైలాగ్‌లతో విరుచుకుపడ్డ బాలకృష్ణ

0
781

హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కేసీఆర్‌పై డైలాగ్‌లతో విరుచుకుపడ్డారు. గడ్డి అన్నారంలో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన మాట్లాడుతూ.. ‘కేసీఆర్.. ఆంధ్రా వస్తావా? రా చూద్దాం’ అని సవాల్ విసిరారు. చంద్రబాబు చరిత్ర చెరిపితే చెరిగేది కాదన్నారు.

హైదరాబాద్‌లో చంద్రబాబు పేరు లేకుండా చేయాలంటే హైటెక్ సిటీ, ఫ్లైఓవర్లు తీసేయాలని.. అవి తీసే దమ్ముందా? అని ప్రశ్నించారు. కేసీఆర్‌ది లాటరీ అని.. చంద్రబాబుది హిస్టరీ అని ప్రసంగించి ఓటర్లను ఆకట్టుకున్నారు. కేసీఆర్‌ను తెలంగాణ ప్రజలు తరిమితే ఎక్కడికో ఓ చోటకి పోవాల్సిందేనన్నారు. గత ఎన్నికల్లో తెలంగాణలో రైతుల ప్రభుత్వం వస్తుందనుకుంటే.. రాబందుల ప్రభుత్వం వచ్చిందని ఆరోపించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here