గూగుల్ పే అధికారికమేనా..? సంస్థకు నోటీసులు..

0
435

ఒకప్పుడు డబ్బులు పంపించాలంటే మని ఆర్డర్ లాంటి సర్వీసులుండేవి. రోజు రోజుకూ పెరుగుతున్న టెక్నాలజీ కారణంగా క్రమంగా ఇంటర్ నెట్ బ్యాంకింగ్, ఫోన్ బ్యాంకింగ్ వరకూ వచ్చి.. నేడు స్మార్ట్ ఫోన్ యుగం కావడంతో గూగుల్ పే అంటూ సింగల్ క్లిక్ తో డబ్బులు పంపించుకునే స్థాయికి వచ్చేశారు జనం. డబ్బులు పంపేందుకు ఈజీ వే కావడంతో ప్రతీ ఒక్కరు ఈ సర్వీస్ ఉపయోగిస్తున్నారు. ఈ తరుణంలో ఇది అధికారికం కాదంటూ ఓ వ్యక్తి హై కోర్టులో పిటిషన్ వేయడం అందరికీ షాకిచ్చింది.

అభిజిత్‌ మిశ్రా అనే వ్యక్తి గూగుల్‌ పే యాప్‌పై దిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ యాప్‌ పేమెంట్స్‌ అండ్‌ సెటిల్‌మెంట్స్‌ చట్టాన్ని ఉల్లంఘించిందని, నగదు బదిలీలు చేసేందుకు ఈ యాప్‌కు కేంద్ర బ్యాంకు నుంచి సరైన ధ్రువీకరణ లేదని మిశ్రా తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అంతేకాదు ఈ ఏడాది మార్చి 20న ఆర్‌బీఐ విడుదల చేసిన అధికారిక పేమెంట్‌ సిస్టమ్‌ ఆపరేటర్స్‌ జాబితాలో గూగుల్‌ పే పేరు లేదని వెల్లడించారు. కాగా మిశ్రా పిటిషన్‌పై దర్యాప్తు చేపట్టిన న్యాయస్థానం.. అధికారిక ధ్రువీకరణ లేకుండానే గూగుల్‌ పే యాప్‌ కార్యకలాపాలను ఎలా సాగిస్తోందని ఆర్‌బీఐని ప్రశ్నించింది. ఈ పిటిషన్‌పై తమ స్పందన తెలియజేయాలని ఆర్‌బీఐ, గూగుల్‌ ఇండియాలకు నోటీసులు జారీ చేసింది హైకోర్టు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here