ఘనంగా శ్రీ చైతన్య టెక్నో స్కూల్ క్యాలెండర్ ఆవిష్కరణ

0
767

హైదరాబాద్: గ్రేటర్ పరిధిలోని మల్లాపూర్ డివిజన్ గోకుల్ నగర్ కాలనీలో గల శ్రీ చైతన్య టెక్నో స్కూల్‌లో కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని ఘనంగా సెలెబ్రేషన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి, పాత్రికేయులు మల్కయ్య హాజరయ్యారు. స్కూల్ పిల్లల సాంకృతిక కార్యక్రమాలు చూసి పిల్లలను, స్కూల్ యాజమాన్యాన్ని అభినందించారు. అనంతరం 2019 క్యాలెండర్ ఆవిష్కరణ చేసి.. కేక్ కట్ చేశారు.

ఈ సందర్భంగా బేతి సుభాష్ రెడ్డి మాట్లాడుతూ.. కార్పొరేట్ విద్యాసంస్థలకు ధీటుగా గత కొన్ని సంవత్సరాలుగా శ్రీ చైతన్య టెక్నో స్కూల్ మెరుగైన విద్యనందిస్తోందని తెలిపారు. మల్లాపూర్ లోని గోకుల్ నగర్ కాలనీలో అందరికీ అందుబాటులో ఉంటూ పేద, ధనిక వర్గాలకు అందరికీ అనువైన ఫీజులతో ఈ విద్యాసంస్థ నడిపిస్తున్న స్కూల్ కరెస్పాండెంట్ అజిత్ రెడ్డికి ఈ సందర్బంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు బేతి. రాబోయే రోజుల్లో ఈ విద్యాసంస్థ మరింత పెద్దదై, ఇంకా ఎక్కువ మంది పిల్లలకు విద్య బుద్దులు నేర్పాలని ఆయన కోరారు. చివరగా నేటి విద్ద్యార్థులే.. రేపటి భావి భారత పౌరులని నినదిస్తూ తన ప్రసంగాన్ని ముగించారు.

అనంతరం కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. శ్రీ చైతన్య టెక్నో స్కూల్ మధ్యతరగతి ప్రజానీకానికి ఓ వరమని, తక్కువ ఫీజులకే మెరుగైన విద్యనందిస్తూ కీర్తిచబడుతోందని అన్నారు. గోకుల్ నగర్ కాలనీ అభివృద్ధికి ఈ విద్యాసంస్థనే పునాది వేసిందని ఈ సందర్బంగా గుర్తుచేశారు పన్నాల. తాను కార్పొరేటర్ పదవి చేపట్టాక ఈ కాలనీలో ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాల రూపేన కోటి రూపాయలు వెచ్చించామని, మున్ముందు ఇంకా పెండింగ్ లో ఉన్న రోడ్లు, డ్రైనేజీ, కమ్యూనిటీ హాల్ చక్కదిద్దెందుకు మరో కోటి రూపాయల మేర ఖర్చు చేస్తామని చెప్పారు. కార్యమానికి విచ్చేసిన పిల్లలకు, తల్లిదండ్రులకు, స్కూల్ టీచర్లకు ధన్యవాదాలు తెలిపారు.

స్థానిక కాలనీ ప్రెసిడెంట్ టీ. మల్కయ్య మాట్లాడుతూ.. మెరుగైన విద్యనందించటంలో మల్లాపూర్ పరిధిలో ఈ పాఠశాల ముందుందని పొగిడారు. ఈ పాఠశాలలో విద్యాబ్యాసం కోసం చుట్టుపక్కల కాలనీల నుంచి పెద్ద ఎత్తున విద్యార్థులు రావటం సంతోషకరమని అన్నారు. కాలనీలో ఇప్పటికే జరిగిన అభివృద్ధికి కృతజ్ఞతలు తెలుపుతూ మున్ముందు ఈ కాలనీపై ప్రత్యేక శ్రద్ద పెట్టాల్సిందిగా ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డిని, కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డిని అభ్యర్థించారు. ఎంతో అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో వీఎస్ఎన్ రెడ్డి, రాజు, వెంకట్ రెడ్డి(మీసాల), సీతారాం రెడ్డి, శ్రీనివాస్, సునిల్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here