చాలా గ్యాప్ తర్వాత మరో మూవీతో అనుష్క

0
290

అనుష్క అంటే తెలియని వారుంటారా? ఉండనే ఉండరు. అందం, అభినయం ఆమెకే సొంతం అనేలా ఉంటుంది. అలాంటి అనుష్క ‘భాగమతి’ తరువాత కొంత గ్యాప్ తీసుకుంది. ఎందుకంటే పాత్ర బలం, కథాబలం కలిగిన సినిమాలు మాత్రమే చేయాలనే తన నిర్ణయమే అందుకు కారణమని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. కాగా కోన వెంకట్ వినిపించిన ఒక కథ నచ్చడంతో అనుష్క గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. రచయితగా .. సహ నిర్మాతగా కోన వెంకట్ వ్యవహరిస్తున్నారు. అయితే క్రిస్మస్ కానుకగా కోన వెంకట్ అనుష్క పోస్టర్ ను విడుదల చేసారు. తమ సినిమా నుంచి వచ్చిన ఈ లుక్ తనకి బాగా నచ్చిందని, ఇప్పటివరకూ వచ్చిన అనుష్క లుక్స్ లో ఇది బెస్ట్ అని చెప్పవచ్చు అని అన్నారు కోన వెంకట్. నిజమే మరి నెమలి ఈక పట్టుకుని ప్రేమ భావనతో .. ఆరాధనా పూర్వకంగా చూస్తున్నట్టుగా వున్న ఈ పోస్టర్ ను చుస్తే మతి పోయేలా ఉంది మరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here