చిలకా గోరింక కూడా సిగ్గుతో తలదించుకునేలా!

0
921

నాలుగు సంవత్సరాలుగా చంద్రబాబు చూపించిన సినిమా చిలకా గోరింక కూడా సిగ్గుతో తలదించుకునే విధంగా జరిగిందిఅని వైసీపీ అధినేత జగన్ మోహన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. పాదయాత్ర ముగింపు బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. “ప్రజా స్వామ్యాన్ని చంద్రబాబు పట్టపగలే ఖూనీ చేస్తున్నాడు. 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్లు కొనుగోలు చేశాడు. వారిలో నలుగురిని మంత్రులను చేసిన పరిస్థితి. చంద్రబాబు పాలనను చూడండి. ఇటువంటి పాలన కావాలా.. ఇటువంటి మనిషి కావాలా..? నాలుగున్నర సంవత్సర కాలం మోసం చేస్తున్నాడు. ఎన్నికలు వచ్చే సరికి డ్రామాలు ఆడుతున్నాడు. ఏ స్థాయిలో ఆడుతున్నాడో ప్రజలంతా గమనించాలి. ఎమ్మెల్యేలను రూ. 20, 30 కోట్లు ఇచ్చి కొనుగోలు చేస్తాడు. పక్కన తెలంగాణకు వెళ్లి ఎన్నికల సమయంలో అమ్ముడుపోయే ఎమ్మెల్యేలకు ఓట్లు వేయొద్దు అని పిలుపునిస్తాడు. ఎన్నికలు వచ్చే సరికి ఊసరవెల్లికంటే ఎక్కువగా రంగులు మార్చుతాడు” అని బాబు ప్రసంగాన్ని గుర్తు చేసి జగన్ విమర్శలు గుప్పించారు.

అక్కడో మాట.. ఇక్కడో మాట..!
ఎన్నికలకు ఆరునెలలు ముందు చంద్రబాబు డ్రామాలు అనే కొత్త సినిమాలు తీస్తున్నారు. చంద్రబాబు మోసాలు ప్రజలు చూస్తున్నారు. ప్రజలంతా నిన్ను నమ్మంబాబు అంటున్నారు. చంద్రబాబు పాలనలో ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే ఖూనీ చేశారు. 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్లు కొన్నారు. అందులో కొందరిని మంత్రలను కూడా చేశారు. చంద్రబాబు పాలనను ఒకసారి చూడండి ఇటువంటి పాలనా కావాలా? అని అడుగుతున్నా.. ఇదే పెద్ద మనిషి నాలుగున్నర సంవత్సరాల కాలం ఎన్నికల వచ్చే సరికి డ్రామాలు ఆడతారు. ఈ విషయాలన్నీ ప్రజలు గమనించాలి. చంద్రబాబు ఆంధ్రరాష్ట్రంలో ఎమ్మెల్యేలను కొంటాడు. ఇదే పెద్దమనిషి పక్క రాష్ట్రం తెలంగాణకు వెళ్లి అక్కడ అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలకు ఓట్లు వేయయద్దు అని చంద్రబాబు పిలుపునిస్తాడు. ఎన్నికల వచ్చేసరికి ఊసరివెల్లిగా వేగంగా మారిపోతాడు. నాలుగున్నరేళ్లుగా ప్రత్యేకహోదాను ఖూనీ చేశాడు అని తీవ్ర స్థాయిలో బాబుపై జగన్ ధ్వజమెత్తారు.

చేసిందంతా చేసి.. దీక్షలా..!
నాలుగు సంవత్సరాలు బీజేపీతో కాపురం చేస్తాడు. నాలుగు సంవత్సరాల్లో బీజేపీని పోగుడుతాడు. తీర్మానాలు చేసి బీజేపీ ప్రత్యేకహోదా ఇవ్వకపోయినా ప్రత్యేకహోదాపై చంద్రబాబు వెటకారం చేసి మాట్లాడతాడు. ప్రత్యేకహోదా పేరు చెప్పితే జైల్లో పెట్టిస్తానంటాడు. ప్రత్యేకహోదా సంజీవనా అని అడుగుతాడు. బీజేపీ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి చేసినట్లుగా ఏ ప్రభుత్వం చేయలేదంటాడు.అసెంబ్లీ తీర్మానాలు పెట్టి నరేంద్రమోదీని పోగుడుతాడు. బీజేపీవాళ్లు కూడా చంద్రబాబు పొగుడుతాడు. కానీ ఇదే పెద్దమనిషి ఎన్నికల వచ్చేసరికి డ్రామాలు మొదలుపెడతాడు. ప్రత్యేకహోదా కోసం తానే పోరాటాలు చేస్తున్నాడంట, ధర్మపోరాటాలు చేస్తున్నాను అంటా ఈ పెద్దమనిషి. ఒకసారి ఆలోచన చేయమని అని అడుగుతున్నా రాష్ట్రంలో దుష్టపాలన సాగుతుంది.చంద్రబాబుకు అనుకూలమైన రెండు పత్రికలు,అనేక టీవీ ఛానెళ్లను అడ్టుపెట్టుకుని రాష్ట్ర ప్రజలకు ఏమి చేయకపోయినా చేసినట్లుగా రాష్ట్రంలో గ్లోబెల్‌ ప్రచారం జరుగుతుందన్నారు అని జగన్ చెప్పుకొచ్చారు.

చిలక గోరింకల్లా ఉండి.. నాటకాలా..!
“నాలుగేళ్లు చిలుకా గోరింకల మాదిరిగా కాపురం చేసిన చంద్రబాబు, బీజేపీలు ఇప్పుడు కపట నాటకాలు ఆడుతున్నాయి. చంద్రబాబు బీజేపీతో విడాకులు తీసున్నారు. ఇప్పుడు మోడీతో యుద్ధమని చెబుతున్నారు. ఈ చెడిపోయిన వ్యవస్థలో మార్పు రావాలి. ఏదైనా హామీ ఇచ్చి నేరవేర్చకపోతే ఆ నాయకుడు పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లాలి. ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థను మార్చాలంటే జగన్‌ ఒక్కరితో సాధ్యం కాదని, జగన్‌కు మీ అందరి తోడు కావాలి. మీ అందరి దీవెనలు కావాలి. అప్పుడే ఈ వ్యవస్థలోకి నిజాయితీ, విశ్వసనీయ అన్న పదాలకు అర్థం వస్తుంది అని జగన్ వ్యాఖ్యానించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here