చీకటిగా ఉంది.. లేకుంటేనా..: పాక్ రక్షణ మంత్రి

0
263

నేడు భారత వైమానిక దళాలు పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై జరిపిన మెరుపు దాడులు పాకిస్థాన్‌ను నవ్వులపాలు చేస్తున్నాయి. ప్రధాని, ఆర్మీ, రక్షణ మంత్రి ఒకరికొకరు పొంతన లేకుండా చేస్తున్న ప్రకటనలతో పాక్ అభాసుపాలవుతోంది. ఆర్మీ ఒక మాట చెబుతుంటే.. ప్రధాని మరో మాట చెబుతున్నారు. దీంతోనే పాక్ పరిస్థితి కాస్త దిగజారితే.. పాక్ రక్షణ మంత్రి పర్వేజ్ ఖటక్ వ్యాఖ్యలు పాక్‌ను మరింత అగాథంలోకి నెట్టేశాయి.

నేటి ఉదయం భారత దళాలు తమ భూభాగంలోకి వచ్చి దాడులకు యత్నించగా.. తాము ధీటుగా బదులివ్వడంతో వెనక్కి వెళ్లిపోయాయని పాక్ ఆర్మీ ప్రతినిధి ఆసిఫ్ గఫూర్ నేటి ఉదయం ట్వీట్ చేశారు. కానీ మధ్యాహ్నానికి సీన్ మారిపోయింది. అసలు వైమానిక దాడులే జరగలేదని.. ఎలాంటి నష్టం తమకు వాటిల్లలేదని పాక్ పేర్కొంది. మరోవైపు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సరైన సమయం చూసి దెబ్బకొడతామంటూ వెల్లడించారు. ఇక తాజాగా రక్షణ మంత్రి పర్వేజ్ ఖటక్.. ‘భారత్‌ను తిప్పి కొట్టేందుకు పాక్ వైమానిక దళం సిద్ధంగానే ఉందని.. కానీ రాత్రివేళ చీకటిగా ఉండటంతో స్పందించలేకపోయింది’ అని పేర్కొన్నారు. ఈ పొంతనలేని వ్యాఖ్యలతో పాక్ అభాసుపాలవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here