జగన్‌తోనే ఎస్సీ,ఎస్టీల అభివృద్ధి…

sc,st development with one and only ys jagan

0
205

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ ‌రెడ్డితోనే ఎస్సీ, ఎస్టీలు అభివృద్ధి చెందుతారని కడప జిల్లా బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి ఎస్. విజయ భాస్కర్ పేర్కొన్నారు. మంగళవారం రాత్రి రాయచోటి మండలం శిబ్యాల గ్రామం హరిజనవాడలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని గ్రామ ప్రజలను అభ్యర్థించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులకు చేసిందేమీ లేదన్నారు. గతంలో చంద్రబాబు ఎస్సీ, ఎస్టీల్లాగా ఎవరైనా పుడతారా? అని చంద్రబాబు అన్న వ్యాఖ్యలను ఈ సందర్భంగా గుర్తు చేసిన ఈ ఎన్నికల్లో బాబుకు బుద్ధి చెప్పాలన్నారు. దళితులను అవమానించే వ్యక్తికి ఓటేయకండని.. జగన్‌‌కు ఓటేస్తే దళితుల అభివృద్ధి జరుగుతుందన్నారు.

ఈ సందర్భంగా పలువురు మహిళలతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు హయాంలో ఒక్క ఎస్సీ ఎస్టీకి అయినా సబ్సిడీపై రుణాలు అందాయా? అని అడగ్గా రాలేదనే చెప్పారు. అదే జగన్మోహన్ రెడ్డి దళితుణ్ణి ప్రక్కన కూర్చనపెట్టుకోని ఎంపీ సీట్లు ప్రకటించారన్న విషయాన్ని ఈ సందర్భంగా విజయ భాస్కర్ గుర్తు చేశారు. అదే జగన్మోహన్ రెడ్డి ఈసారి అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీలకు మేలు జరుగుతుందని… దళితుల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారన్నారు. దళితులందరీకీ పక్కా ఇళ్లు నిర్మించి అన్ని విధాలా ఆయన ఆదుకుంటారన్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేసి జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసుకొని.. ఎమ్మెల్యేగా శ్రీకాంత్ రెడ్డిని.. ఎంపీగా మిథున్ రెడ్డిని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ ఎన్నికల ప్రచారంలో శ్రీకాంత్‌తో పాటు పలువురు ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here