జగన్ గృహప్రవేశానికి వైసీపీ పెద్దదిక్కు డుమ్మా!?

ysrcp main leader did not attend ys jagan house warming ceremony

0
236

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నవ్యాంధ్ర రాజధాని అమరావతిలోని కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన విషయం విదితమే. బుధవారం రోజున సర్వమత ప్రార్థనల మధ్య ఉదయం 8.19 గంటలకు ఈ గృహప్రవేశం కార్యక్రమం జరిగింది. ఈ వేడుకకు.. జగన్ ‌కుటుంబ సభ్యులు వైఎస్‌ విజయమ్మ, షర్మిల, అనిల్‌ కుమార్‌, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్‌ రెడ్డి, తలశిల రఘురాం, ప్రాంతీయ కో–ఆర్డినేటర్లు, పార్లమెంటు జిల్లా అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర అధికార ప్రతినిధులు, అనుబంధ విభాగాల రాష్ట్ర అధ్యక్షులు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అందరూ వచ్చారు కానీ రావాల్సిన.. జగన్‌కు కావాల్సిన వ్యక్తి మాత్రం ఈ వేడుకకు రాలేదు.

జగన్ బాబాయ్, వైసీపీకి పెద్ద దిక్కు, ఒంగోలు మాజీ ఎంపీ అయిన వైవీ సుబ్బారెడ్డి డుమ్మా కొట్టారు. ఇప్పుడీ డుమ్మా వ్యవహారం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. అసలు ఆయన ఎందుకు రాలేదు..? జగన్‌కు-సుబ్బారెడ్డికి చెడిందా? జగన్ వైఖరితో వైవీ అసంతృప్తితో ఉన్నారా..? గృహ ప్రవేశానికి అందరూ హాజరుకావాలని ప్రముఖులందరికీ ఆహ్వానాలు పలికిన ఆయనే ఎందుకు రాలేదు…? అని అటు టీడీపీ.. ఇటు సొంత పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.

వైసీపీ అధినేత వైఎస్ జగన్ నూతన గృహప్రవేశం ఫొటోల కోసం క్లిక్ చేయండి..

గత ఎన్నికల్లో వైసీపీ తరఫున ఒంగోలు నుంచి పోటీచేసిన వైవీ సుబ్బారెడ్డి విజయదుందుబి మోగించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంట్‌ పరిధిలోని పలు నియోజకవర్గాల్లో సర్వేలు చేశారని ఆయన గెలిచే అవకాశాలు తక్కువగా ఉన్నాయని అందుకనే ఆయన్ను కాకుండా వేరొకర్ని ఒంగోలు నుంచి బరిలోకి దింపాలని జగన్ భావిస్తున్నారట. అందుకే ఆయన పైకి అలా ఉన్నా.. లోపల మాత్రం అసంతృప్తితో ఉన్నారట. అయితే ఎంపీగా కాకుండా ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని జగన్ భావిస్తున్నారని అందుకే ఆయనకు సీటు ఫిక్స్ చేయలేదని టాక్ నడుస్తోంది. అయితే ఒంగోలు ఎంపీ సీటు.. టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలోకి రావాలనుకుంటున్న మాగుంట శ్రీనివాస్ రెడ్డికి లేదా వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిళకు ఇస్తారనే పుకార్లు వస్తున్నాయి. సుబ్బారెడ్డి ఎందుకు రాలేదో ఏమోగానీ మీడియాలో మాత్రం పెద్ద ఎత్తున కథనాలు వచ్చేస్తున్నాయి. అయితే ఈ డుమ్మాపై సుబ్బారెడ్డి మీడియా ముందుకొచ్చి ఏం చెబుతారా అన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here