జగన్ ప్రచారంలో అపశృతి.. 20 మందికి పైగా తీవ్ర గాయాలు

0
267

వైసీపీ అధినేత జగన్ ప్రచారంలో అపశృతి చోటు చేసుకుంది. నేడు తూర్పు గోదావరి జిల్లా మండపేటలో జగన్ ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో జగన్ అభిమానులు, వైసీపీ కార్యకర్తలు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో రోడ్లు కిక్కిరిసి పోవడంతో.. రోడ్లకు ఇరువైపులా ఉన్న భవనాలపై భారీ సంఖ్యలో అభిమానులు నిలబడ్డారు. ఒక్కసారిగా అక్కడి పిట్టగోడ కూలిపోవడంతో పెను ప్రమాదం సంభవించింది. దాదాపు 20 మందికి పైగా తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. గాయపడిన వారిలో పలువురు మీడియా సిబ్బంది కూడా ఉన్నట్టు తెలుస్తోంది. క్షతగాత్రులను హుటాహుటిన దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here