జగన్ విజయం.. ఫెడరల్ ఫ్రంట్‌లోకి రావడం ఖాయం

0
471

ఏపీలో వైసీపీ విజయం ఖాయమని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. నేడు నర్సంపేటలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ఏపీ ఎన్నికలపై ఆసక్తికరంగా స్పందించారు. ఏపీ ఎన్నికల్లో జగన్ గెలవడం ఖాయమని.. ఫెడరల్ ఫ్రంట్‌లోకి వస్తారని కేటీఆర్ స్పష్టం చేశారు. ఫ్రంట్‌తో కలిసి పనిచేసే వాళ్ల పేర్లను కూడా కేటీఆర్ నేడు వెల్లడించారు. ఏపీలో జగన్, పశ్చిమబెంగాల్‌లో మమతాబెనర్జీ, ఉత్తరప్రదేశ్‌లో మాయావతి, ఒడిస్సాలో నవీన్ పట్నాయక్, అఖిలేష్ యాదవ్‌ ఫెడరల్ ఫ్రంట్‌తో కలిసి పనిచేస్తారని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ దేశంలో కాంగ్రెస్, బీజేపీ అంటే పడనోళ్లు చాలామంది ఉన్నారని కేటీఆర్ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here