జగన్ సీఎం కావాలని ‘నలంద’లో చండీయాగం

nalanda college : yagam being performed for ys jagan to win 2019 elections

0
463

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న ఎన్నికల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని నలంద ఇంజనీరింగ్ కళాశాలలో చండీయాగం ప్రారంభించారు. మంగళవారం నాడు వైసీపీ డ్వాక్రా సంఘాల రాష్ట్ర అధ్యక్షురాలు, నలంద విద్యాసంస్థల సెక్రటరీ ఆరిమండ విజయశారదా రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి వరప్రసాద్ రెడ్డి ఈ యాగాన్ని ప్రారంభించారు. కాగా.. ఏప్రిల్-11 వరకు ఈ యాగం కొనసాగుతుందని వారు చెబుతున్నారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన వరప్రసాదరెడ్డి.. జగన్ సీఎం కావాలని.. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఈ యాగం చేపట్టామన్నారు. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.. తిరిగి సాయంత్రం 5 గంటల నుంచి 8:30 వరకు పూజలు జరుగుతాయన్నారు. ప్రతి రోజు మహాలింగార్చన, చండీపారాయణ, మహావిద్య పారాయణ, ప్రత్యంగిర పారాయణ, నవగ్రహ జపములు, సుందరకాండ పారారయణ, మన్యు సూక్త పారాయణ, రుద్ర చండీ హోమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

175 నియోజకవర్గాల అభ్యర్థుల పేరిట..
రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల వారిగా పోటీ చేసే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు, 25 మంది ఎంపీ అభ్యర్థుల గోత్రనామాలతో యాగం జరుగుతోంది. రాష్ట్ర ప్రజల క్షేమం, అభివృద్ధిని కోరుతూ ఈ యాగాన్ని తలపెట్టినట్లు విజయశారదా రెడ్డి, వరప్రసాద్ రెడ్డి మీడియాకు వివరించారు.

యాగమే కాదు ఎన్నికల ప్రచారం కూడా..
జగన్ సీఎం కావాలని అలాగే సత్తెనపల్లిలో వైసీపీ జెండా ఎగరేయాలని విజయశారదారెడ్డి ఎన్నికల ప్రచార బరిలోకి దిగారు. బుధవారం నాడు సత్తెనపల్లిలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. సత్తెనపల్లిలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి రాంబాబు, వైసీపీ ఎంపీ అభ్యర్థికే మీ అమూల్యమైన ఓటును వేసి వేయించి అఖండ మెజార్టీతో గెలిపించాలని నియోజకవర్గ ప్రజలను ఆమె కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here