జనసేనానికి బన్నీ తోడు! పార్టీ వర్గాల్లో ఆనందం

2
731

ఆంధ్రప్రదేశ్ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అధికార, ప్రతిపక్షాలు పోటాపోటీగా బరిలోకి దిగుతుండటంతో రాష్ట్రంలో రాజకీయ వేడి రాజుకుంటోంది. ఇప్పటికే వైసీపీ, టీడీపీ పార్టీలు బలంగా ఉండగా.. ఎన్నికలు దగ్గరపడ్డ ఈ కీలక తరుణంలో జనసేన పార్టీ కూడా బలపడుతోంది.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి మెగా ఫ్యామిలీ మద్దతు లభిస్తోంది. జనసేనకు మద్దతుగా మొదటి కొణిదెల నిహారిక రంగంలోకి దిగగా.. ఆ తర్వాత వరుణ్ తేజ్, రామ్ చరణ్ వరుసగా బాబాయ్ కి తమ తమ మద్దతు తెలిపారు. కాగా తాజాగా మెగా కాంపౌండ్ హీరో, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా జనసేనకు మద్దతు తెలుపబోతున్నారు.

ఈ నెల 9 వ తేదీన హైదరాబాద్ నుండి బయలుదేరి రాజమండ్రి చేరుకొని అక్కడ నుండి పాలకొల్లు లో పవన్ కళ్యాణ్ ని కలిసి పరామర్శించి, ఆయనకి మద్దతు పలుకనున్నారట అల్లు అర్జున్. ఆ తరువాత నర్సాపురం పార్లిమెంట్ అభ్యర్థి నాగబాబును కూడా కలిసి మద్దతు ప్రకటిస్తారని సమాచారం. కాగా మెగా హీరోల ఎంట్రీతో జనసేన వర్గాల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.

2 COMMENTS

  1. us viagra for sale

    జనసేనానికి బన్నీ తోడు! పార్టీ వర్గాల్లో ఆనందంRanarangam news, telugu cinema news, trailers, reviews and Political news | Ranarangam news, telugu cinema news, trailers, reviews and Political news

  2. buy cialis online

    జనసేనానికి బన్నీ తోడు! పార్టీ వర్గాల్లో ఆనందంRanarangam news, telugu cinema news, trailers, reviews and Political news | Ranarangam news, telugu cinema news, trailers, reviews and Political news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here