టాలీవుడ్ ‘పీఆర్ఓ’ చిత్రానికి సైమా అవార్డ్‌

3
613

ఒక సినిమాకి ప్రీ ప్రోడ‌క్షన్‌, పొస్ట్ ప్రోడ‌క్షన్ ఎంత అవ‌స‌ర‌మె ప్రచార క‌ర్త చాలా అవ‌స‌రం. మ‌నం ఎంత గొప్ప చిత్రాలు తీసినా కూడా వాటిని ప్రేక్షకుల ద‌గ్గర‌కి తీసుకువెళ్ళే దారి లేకుంటే అదో గ‌తే.. గ‌తం లో ఎంట‌ర్‌టైన్‌మెంట్ అంటే కేవ‌లం సినిమా మాత్రమే వుండేది కాని ఇప్ప‌డు అలా కాదా ప్రేక్షకుడికి ఎంట‌ర్‌టైన్‌మెంట్ అంతా మెబైల్స్‌లోనే దొరుకుతుంది. ఫ్యామిలి ఆడియ‌న్స్‌కి బుల్లితెరలో దొరుకుతుంది. వీట‌న్నిటికి ఎదుర్కొని తీసుకు రావాలంటే మాత్రం సరైన ప్రచార క‌ర్త చాలా అవ‌స‌రం.. టాలీవుడ్‌లో ఏలూరు శ్రీను అనే పీఆర్ఓ గురించి వినే వుంటారు. అంద‌రితో న‌వ్వుతూ ప‌ల‌క‌రించ‌టం అత‌ని గుణం. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌ర్ని క‌లుపుకుంటూ ముందుకు వెళ్ళిపోతాడు. అందుకే ఆయ‌న‌కి టాలీవుడ్ లో చాలా మంచి పేరు వుంది. విచిత్రం ఏంటంటే ఆయ‌న చేసే చిత్రాలే కాకుండా సినిమా ఇండ‌స్ట్రిలో ఏ మంచి చిత్రం వచ్చినా త‌న స‌పోర్ట్ చేస్తాడు.

ఈయ‌న అల్లు అర్జున్‌, ర‌వితేజ‌, అల్లు శిరష్, సాయిధ‌ర‌మ్‌తేజ్‌, నిఖిల్‌, సుధీర్ బాబు, నిహ‌రిక‌, సునీల్ , త‌మిళ హీరో సూర్యకి ప‌ర్సన‌ల్ పీఆర్ఓగా చేస్తాడు. అలానే గీతా ఆర్ట్స్‌, యువి క్రియోష‌న్స్‌, 70 ఎం.ఎం ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, జి ఏ2, మారుతి టాకీస్‌, సుధీర్‌బాబుప్రోడ‌క్షన్‌, ఆర్‌పిఏ క్రియోష‌న్స్ లాంటి బ్యాన‌ర్స్‌కి కూడా వ‌ర్క్ చేస్తారు. అయితే ఎన్ని చేసినా కూడా ఏలూరు శ్రీనుని మెగా బ్రాండ్ పిఆర్ఒగా గుర్తిస్తారు. ఎందుకంటే మెగా ఫ్యామిలికి వీరాభిమానిగా త‌న మాట‌లు వుంటాయి క‌నుక‌.. ఏలూరు శ్రీను ఇటీవ‌ల కొన్ని చిత్రాల్లో న‌టించాడు బ‌స్టాప్‌, ల‌వ‌ర్స్‌, రొజులు మారాయి, ఒక్క క్షణం, కొత్త జంట‌, చిత్రం భ‌ళారే విచిత్రం, కొబ్బరిమ‌ట్ట లాంటి చిత్రాల్లో న‌టించారు కానీ ఆయ‌న‌కి ద‌ర్శక‌త్వం వైపు మ‌క్కువ ఎక్కువ కావ‌ట వ‌ల‌న త‌నేంటో ప్రూవ్ చేస‌కొవటానికి ఇటీవ‌ల రెండు ల‌ఘ చిత్రాలు ద‌ర్శక‌త్వం వ‌హించాడు.. దాంట్లో ఒక‌టి మా కాల‌ని ఫిగ‌ర్‌, రెండ‌వ‌ది వాట్ ఏ అమ్మాయి.. ఈ రెండు చిత్రాలు సోష‌ల్ మీడియాలో స‌క్సస్ అవ్వట‌మే కాకుండా వాట్ ఏ అమ్మాయి కి మంచి పేరు కూడా వ‌చ్చింది.. స్టూడియో ఒన్ షార్ట్ ఫిల్మ్ అవార్డ్స్ లో బెస్ట్ యాక్ట్రస్ అవార్డు‌ని మా కాల‌ని ఫిగ‌ర్ సాధిస్తే.. ఇప్పడు ఏకంగా వాట్ ఏ అమ్మాయికి మ్యూజిక్ డైర‌క్టర్ న‌రేష్‌పెంట కి సైమాలో నామినేట్ అయ్యాడు.. ఏలూరు శ్రీను ప్రయాణం మెగా అభిమానిగా స్టార్టయ్యి జ‌ర్నలిస్ట్ గా, పిఆర్ఒగా స‌క్సస్ అయ్యి న‌టుడిగా మిడిల్ డ్రాప్ అయ్యి ద‌ర్శకుడిగా యూట్యూబ్‌కి చేరాడు.. అస‌లు ఈ మెగా పీఆర్ఓ మెగా ఫోన్ ప‌ట్టుకుంటాడో లేదో చూడాలి.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here