టీఆర్ఎస్‌కు కోలుకోలేని షాక్ ఇచ్చిన చేవెళ్ల ఎంపీ

0
541

చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి టీఆర్ఎస్‌కు కోలుకోలేని షాక్ ఇచ్చారు. పార్టీకి రాజీనామా చేసి.. రాజీనామా లేఖను తెలంగాణ భవన్‌కు పంపించారు. ఇటీవల ఓ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ నుంచి ఇద్దరు ఎంపీలు కాంగ్రెస్‌లోకి వస్తున్నారని దమ్ముంటే ఆపాలంటూ సవాల్ విసిరిన విషయం తెలిసిందే. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఆయన మాటలు అక్షర సత్యమయ్యేలా కనిపిస్తున్నాయి.

రేవంత్ సవాల్ నేపథ్యంలో కేటీఆర్ విశ్వేశ్వరరెడ్డితో పాటు మరో ఎంపీని ప్రగతి భవన్‌కు పిలిపించి మాట్లాడారు. అయినా కూడా విశ్వేశ్వరరెడ్డి రాజీనామా చేయడం ఆ పార్టీని విస్మయ పరుస్తోంది. తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్న ఈ తరుణంలో విశ్వేశ్వరరెడ్డి పార్టీ కార్యక్రమాలకు కొద్ది రోజులుగా దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ నెల 23న ఆయన కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సో్నియా గాంధీ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకోనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here