టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా ఖరారు

0
281

మార్చి 12న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు నిన్నటి నుంచి నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో నేడు ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాను టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించారు. శాసనసభ్యల కోటాకు సంబంధించి త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. నాలుగు స్థానాలను ఎస్టీ, మైనారిటీ, బీసీ, ఓసీకి కేటాయించారు. మరో స్థానాన్ని ఎంఐఎంకు కేటాయించారు.

అన్ని సామాజిక వర్గాలకూ ఈ ఎన్నికల్లో సమాన అవకాశం కల్పించారు. హోంమంత్రి మహమూద్ అలీని మాత్రం యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించారు. రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడు ఎగ్గె మల్లేశం, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ శేరి సుభాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్‌లను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రకటించారు. మరో స్థానం ఎంఐఎంకు కేటాయించారు. ఈ ఐదు స్థానాలు పక్కాగా టీఆర్ఎస్ గెలిచే అవకాశముంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here