టీఆర్ఎస్ చేసిన బ్లండర్ మిస్టేక్స్ లగడపాటి మాటల్లో..

0
602

మాజీ ఎంపీ, ఆంధ్ర ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ తెలంగాణ ఎన్నికలపై సర్వేతో పాటు కొన్ని ఆసక్తికర, సంచలన విషయాలను ఆయన బయటపెట్టారు. మరీ ముఖ్యంగా కేటీఆర్‌‌తో చేసిన చాటింగ్‌‌తో పాటు అంతకు మునుపు జరిగిన భేటీలో ఏమేం చర్చకు వచ్చాయ్.. అసలు టీఆర్ఎస్ మైనస్ పాయింట్స్ ఏంటి అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.

లగడపాటి మాటలు యథావిథిగా…
:- కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ కూటమిగా ఏర్పడడంతో పరిస్థితులు మారిపోయాయి.
:- సెప్టెంబర్ తర్వాత ప్రజల్లో వేగంగా మార్పు గమనిస్తున్నాను.
:- కూటమి ఏర్పడిన తర్వాత ప్రజాప్రతినిధులపై వ్యతిరేకతతో పాటు, ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కూడా బయటకు వచ్చింది.
:- ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ ఇప్పుడు ప్రజలు అడుగుతున్నారు.
:- దళిత సీఎంపై మాట తప్పారని ఇంత కాలం అడగలేదు కానీ, ఇప్పుడు నిలదీస్తున్నారు.
:- దళితులకు మూడెకరాల భూమిని ఇవ్వలేదన్న విషయంలో ఆ సామాజివకర్గం ఏకమయింది.. దీంతో టీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడింది.
:- ఆదివాసీలకు(ఎస్టీ) 12 శాతం రిజర్వేషన్ హామీ నిలబెట్టుకోకపోవడంతో వరంగల్, ఆదిలాబాద్ జిల్లాలో ఎస్టీ సామాజికవర్గం మొత్తం మహాకూటమి వైపు మొగ్గు చూపుతోంది
:- డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వకపోవడంతో పట్టణాల్లో టీఆర్ఎస్‌కు తీవ్రమైన వ్యతిరేకత వస్తోంది.
:- ప్రజా కూటమి ఏర్పాటుతో రెండు సమ ఉజ్జీలుగా మారిపోయాయి.
:- కూటమి మేనిఫెస్టో కూడా ప్రజల్లో మార్పు తెచ్చింది
:- మైనార్టీల్లో వేగంగా మార్పు వస్తోంది.. ముస్లింలు రిజర్వేషన్ విషయంలో క్రమంగా టీఆర్ఎస్ కు దూరం జరుగుతున్నారు
:- పోటా పోటీ పరిస్థితి వచ్చినప్పుడు ఇవి అన్నీ ప్రజలు గమనిస్తారు.
:- ప్రతిపక్షాలు బలహీనంగా ఉంటే ప్రభుత్వ వ్యతిరేకత కనిపించదు కానీ.. అదే ప్రతిపక్షాలు ఏకమైతే ప్రభుత్వంతో పాటు స్థానిక ఎమ్మెల్యే గుణగణాలు, చేపట్టిన అభివృద్ధి పనులు, గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు చర్చకు వస్తాయి.
:- ఇప్పుడు తెలంగాణలో చంద్రబాబు, కోదండరాం, కమ్యూనిస్టులు, కాంగ్రెస్ నేతలు ఏకం కావడంతో అదే పరిస్థితి ఏర్పడింది
:- దీనికి తోడు డబుల్ బెడ్రూమ్ దక్కని ప్రజలకు అధికారంలోకి రాగానే రూ.50 వేలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించడంతో పరిస్థితి ఇంకా దిగజారింది
:- కాంగ్రెస్ నాయకత్వంలోని మహాకూటమి ఇచ్చిన హామీలు ప్రజలపై తీవ్రంగా ప్రభావం చూపుతున్నారు అని లగడపాటి రాజగోపాల్ వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here