టీడీపీకి భారీ షాక్.. జనసేన గూటికి ఎమ్మెల్యే

0
785

టీడీపీకి త్వరలో భారీ షాక్ తగలనుంది. మాజీ మంత్రి, ఎమ్మెల్యే అయిన రావెల కిషోర్‌‌బాబు త్వరలోనే టీడీపీకి రాజీనామా చేయనున్నారు. డిసెంబర్ 1న విజయవాడలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో రావెల ఆ పార్టీలో చేరనున్నారు. కాగా ప్రస్తుతం పత్తిపాడు టీడీపీ ఎమ్మెల్యేగా ఆయన ఉన్నారు. కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీ తనను పట్టించుకోవట్లేదని కొంతకాలంగా రావెల అసంతృప్తితో ఉన్నారు. ఇప్పటికే జనసేనలో చేరికపై పవన్ కల్యాణ్‌‌తో రెండు దఫాలుగా రావెల భేటీ అయ్యారు.

రావెల పార్టీ మారుతున్నట్లు తెలుసుకున్న టీడీపీ అధిష్టానం బుజ్జగించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా గత కొన్ని రోజులుగా రావెల పార్టీ మారతారని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఆ వార్తలను రావెల ఒక్కసారి కూడా ఖండించలేదు. కాగా.. కార్యకర్తలు, అనుచరులు, స్థానిక నేతలతో నిశితంగా చర్చించిన అనంతరం జనసేనలో చేరడానికి ఆయన సిద్ధమయ్యారని తెలుస్తోంది. డిసెంబర్‌‌ 1న రావెల.. నియోజకవర్గంలోని పలువురు స్థానిక నేతలతో కలిసి విజయవాడకెళ్లి పవన్ సమక్షంలో జనసేన కండువా కప్పుకోనున్నారు.

కాగా.. 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన రావెల కిషోర్.. వైసీపీ అభ్యర్థి మేకతోటి సుచరితపై 7,405 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అనంతరం ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఆయనకు ఏపీ కేబినెట్‌‌లో చంద్రబాబు చోటు కల్పించారు. అనంతరం కొన్ని పరిణామాల వల్ల రావెలను మంత్రి పదవి నుంచి తప్పించడం జరిగింది. అప్పట్నుంచి అసంతృప్తితో ఉన్న ఆయన గురువారం సాయంత్రం పార్టీ మారాలని సంచలన నిర్ణయం తీసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here