‘డబ్ శ్మాష్’ మూవీ రివ్యూ

0
306

డైరెక్టర్ : కేశవ్‌ దేవూర్‌
నటీనటులు : పవన్ కృష్ణ, సుప్రజ, గెటప్ శ్రీను
నిర్మాతలు : ఓంకార లక్ష్మీ, సుబ్రహ్మణ్యం
మ్యూజిక్: వంశీ.బి
డీఓపీ: రమేష్. ఆర్
కో-ప్రోడ్యూసర్: గజ్రేంద్ర
పీఆర్వో : సాయి సతీష్

కథ:-
ఒక కాలేజ్ యూత్‎తో ‘డబ్ శ్మాష్’ సినిమా కథ మొదలవుతుంది. అందరూ కలిసి వాట్సాప్ గ్రూప్ ద్వారా మేసేజ్ చేసుకుని ఒక లోయ దగ్గరకు రావాలని అనుకుంటారు. మొత్తం ఆరుగురు సభ్యులతో కూడిన ఈ టీమ్ తమ లైఫ్‌లో ఏమీ సాధించలేదని సూసైడ్ చేసుకుందామని ప్లాన్ చేసుకుని వస్తారు. కానీ వారు సూసైడ్ చేసుకోరు.. ప్లాన్ ఎందుకు రివర్స్ అయ్యింది..? బతికి వాళ్లు ఏం సాధించాలని అనుకుంటారు..? ఏం సాధించారు..? అనేది తెలియాలంటే థియేర్లకు వెళ్లి సినిమా చూడాల్సిందే మరి.

డైరెక్టర్ వినూత్న ప్రయోగం!
అయితే.. ఆ సూసైడ్ రద్దు అయిన తర్వాత ఇంటడ్రక్షన్ సాంగ్ వస్తుంది. కథ విషయానికి వస్తే.. ‘డబ్ శ్మాష్’ యాప్ ఇప్పుడు ప్రతి ఆండ్రాయిడ్ మొబైల్‌లో ఉంది. యాప్ (అదేనండి టిక్ టాక్, హలో యాప్ లాంటివి) ఆ యాప్ ద్వారా కథను సిద్ధం చేసుకొని కథ రాసాడు డైరెక్టర్. ఓ వైపు కథ.. మరో వైపు గెటప్ శ్రీను కామెడీని బాగానా లాక్కొచ్చాడు డైరక్టర్. హీరోను మాత్రం అంతగా ప్రజెంట్ చేయలేకపోయారు. హీరో శర్వాన్ (పవన్), హీరోయిన్ మేఘన ‘డబ్ శ్మాష్’యాప్‌లో పరిచయమవుతారు. వారిద్దరూ కాలేజీ కలుసుకోవడం ప్రేమలో పడే విధానాన్ని పర్లేదు బాగానే చూపించాడు.

సెకండాఫ్ ఇంట్రెస్టింగ్!
ఫస్టాప్ పర్లేదు అనిపించినప్పటికీ సెకాండాఫ్ మాత్రం అదుర్స్ అనిపించాడు. హీరోయిన్‌ను హీరో కిడ్నాప్ చేసిన తర్వాత ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు ఉంటాయి. సెకండాఫ్‌తోనే సినామా సక్సెస్ అవుతుంది. హీరోయిన్ ఎలా కిడ్నాప్ అయింది..? ఎవరు చేశారు..? వీరు ఎలా ఫస్ట్ ప్రైజ్ సాధించారు..? అనే సన్నివేశాలను చాలా చక్కగా చూపించారు.

విశ్లేషణ:-
పస్తుతం ప్రతి మొబైల్‌లో టిక్ టాక్ యాప్ అనేది ఉంది. అలానే ఈ సినిమాలో ‘డబ్ శ్మాష్’ యాప్ పెట్టారు. దీనితో సినిమా అంతా నడుస్తోంది. ఈ సినిమాలో ‘డబ్ శ్మాష్’ వీడియోలు తీసి అప్‌లోడ్ చేయడం అందిరీకీ తెలుసు. ఇది ఇలా ఉంటే.. ఈ యాప్ ద్వారా హీరోయిన్ కాలేజీలోకి ఎంట్రీ ఇస్తుంది. హీరో, హీరోయిన్‌కి పరిచయం ఏర్పడుతుంది. ఇద్దరు ప్రేమలో పడుతారు. కాలేజీలో చిన్నచిన్న గొడవలు వస్తాయి. అలా కథసాగుతూనే ఉంటుంది. మధ్యలో కామెడీతో సినిమాను బాగానే డైరెక్టర్ లాక్కొచ్చాడు. ఒక్క మాటలో చెప్పాలంటే కామెడీ కేరాఫ్‌గా పేరుగాంచిన శ్రీను ‘గెటప్’ అదరగొట్టేశాడు. హీరో-హీరోయిన్ మధ్య రొమాన్స్‌ ఉంటుందని భావించిన యూత్‌కు కాస్త కష్టమే..!. కామెడీ టైమింగ్ ఉంటే ఇంకాస్త బాగుండేది. హీరో యాక్టింగ్ ఇంకాస్త చూపించి ఉంటే బాగుండేది.

తారాగణం గురించి..:-
‘డబ్ శ్మాష్’ లో మాత్రం సినిమా గురించి మొత్తం చెప్పారు. గెటప్ శ్రీను తన యాక్టింగ్ ద్వారా కాలేజీ క్యాంటిన్‌లో చాలా క్లుప్తంగా వివరించాడు. అంతేకాదు..సినిమా అంటే ఏంటి ఎక్కడ మొదలైంది..? అనే పాయింట్ నుంచి ఇప్పుడు జరిగే జనరేషన్ వరకు పాయింట్ టూ పాయింట్ చాలా చక్కగా డైరెక్టర్ వివరించేందుకు డైరెక్టర్ మంచి ప్రయత్నం చేశాడు. అంతేకాకుండా సినిమాలో రెండవ పాట మొత్తం సినిమా గురించి దానిలో మూజిక్ డైరెక్టర్ చాలా బాగా చూపించారు. లిరిక్స్ కూడా బాగా రాశారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సూపర్ గా ఇచ్చారని చెప్పుకోవచ్చు. అయితే సినిమా గెటప్ శ్రీను కామెడీ టైమింగ్ కోసము చూడొచ్చు. సినిమాలో కొత్త నటీనటులుగా నటించినప్పటికీ మంచి ఆదరణ లభిస్తోంది. కొత్త నటులు అయినప్పటికీ వారివారి పాత్రల్లో మాత్రం నటించమంటే జీవించి ఒదిగిపోయారని చెప్పుకోవచ్చు. కామెడీ కమ్ మంచి మెసేజ్ సినిమా కావడంతో ప్రేక్షకులు ఆదరిస్తారు.. కలెక్షన్ల పరంగా పెద్దగా డోకా ఉందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదేమో..!

ప్లస్ పాయింట్స్:-
గెటప్ శ్రీను కామెడీ కిరాక్
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదుర్స్
సాంగ్స్
సెకండాఫ్

మైనస్ పాయింట్స్:-
కథ, స్క్రీన్ ప్లే ఇంకాస్త బాగుండాల్సింది..
అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు
హీరో ప్రజెంటేషన్

రణరంగం ట్యాగ్‌లైన్ : కామెడీ కమ్ మంచి మెసేజ్ ఇచ్చిన ‘డబ్ శ్మాష్’
రేటింగ్ : 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here