తెలంగాణ ఎన్నికలపై పవన్ కీలక నిర్ణయం!

0
354

జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నట్టు వాట్సాప్‌లో ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఏపీలోని ఏలూరు నగరంలో జరిగిన రాష్ట్ర స్థాయి పార్టీ మీటింగ్ లో తెలంగాణ ఎన్నికల అంశాన్ని చర్చించినట్టుగా వాట్సాప్ పోస్ట్ కథనం. ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలి.. జనసేన స్టాండ్ ఏంటీ అని నేతలు, కార్యకర్తలు ప్రశ్నలు సంధించగా పవన్ సమాధానమిచ్చారని తెలుస్తోంది. ఈ సందర్భంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారంటూ వాట్సాప్ పోస్ట్ వెల్లడిస్తోంది.

‘‘తెలంగాణ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయటం లేదు.. బలం లేని చోట బరిలోకి దిగాలనే ఆలోచన పార్టీకి లేదు. ప్రస్తుతానికి ఏపీ వరకు మన పోరాటం.. తెలంగాణ ఎన్నికల్లో మాత్రం మద్దతు ఇస్తాం. సీఎం కేసీఆర్ పరిపాలన బాగుంది.. కాళేశ్వరం, పాలమూరు లాంటి భారీ నీటి ప్రాజెక్టులు కడుతున్నారు.. పెన్షన్స్ చెల్లింపులోనూ పారదర్శకంగా ఉంది. డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం చేపడుతున్నారు. బడుగు, బలహీన వర్గాలకు అండగా టీఆర్ఎస్ ప్రభుత్వం నిలుస్తుంది. మన విధానాలు, సిద్ధాంతాలకు అనుగుణంగా కేసీఆర్ పాలన సాగుతుంది. ఏపీలోనూ కేసీఆర్ పరిపాలనపై మంచి అభిప్రాయంతో ఉన్నారు ప్రజలు. అందుకే తెలంగాణ ఎన్నికల్లో జనసేన మద్దతు టీఆర్ఎస్ పార్టీకే’’ అని పవన్ వెల్లడించినట్టుగా వాట్సాప్‌లో వైరల్ అవుతోంది. దీనిపై నిజానిజాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here