‘ది లయన్ కింగ్’ రివ్యూ

7
954

‘ది లయన్ కింగ్’ – విజువల్ ట్రీట్
విడుదల తేదీ : జూలై 18, 2019
రేటింగ్ : 4/5
దర్శకత్వం : జోన్ ఫావ్రియు
సంగీతం : హన్స్ జిమ్మెర్
సినిమాటోగ్రఫర్ : జోసెఫ్ కాలెబ్
స్క్రీన్ ప్లే : జెఫ్ నాథన్సన్
ఎడిటర్స్ :మార్క్ లివోల్సి, ఆడమ్ గెర్స్టెల్

ప్రపంచ ప్రఖ్యాత సినీ నిర్మాణ సంస్థ డిస్నీవారు సమర్పణలో 3డి ఆనిమేటెడ్‌ టెక్నాలజీతో నిర్మించిన జంగిల్ యానిమేషన్ మూవీ ‘ది లయన్ కింగ్’. కాగా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రధాన భాషలలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

కథ :-
అడవికి రారాజుగా అలాగే ఓ గొప్ప రాజుగా పిలవబడే సింహం (ముఫాస) తన తరువాత తన రాజ్యానికి తన ‘కొడుకు సింహం’ (సింబా) రాజు అవ్వాలని బలంగా కోరుకుంటాడు. చిన్నప్పటి నుండి సింబాకి ఒక రాజు ఎలా ఉండాలో చెప్తూ పెంచుతాడు. అయితే.. ముఫాస తమ్ముడు (స్కార్ సింహానికి)ఇది ఏ మాత్రం నచ్చదు. తన అన్నయ్య మీద ద్వేషంతో పగతో రగిలిపోతాడు. ఆ తరువాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం ముఫాస సింహం చనిపోతుంది. దాంతో ఆ రాజ్యానికి సింబా దూరం అవుతాడు. ఆ తరువాత జరిగే కొన్ని సంఘటనల తరువాత స్కార్ ఆ రాజ్యానికి రాజు అవుతాడు. దాంతో ఆ రాజ్యం కళని కోల్పోయి కష్టాల్లో పడుతుంది.మళ్లీ ఆ రాజ్యానికి సింబా ఎలా రాజు అయ్యాడు..? ఆ రాజ్యం కష్టాలను ఎలా తీర్చాడు ? అసలు ముఫాస ఎలా చనిపోయాడు ? చివరికి సింబా తన తండ్రి కోరిక తీరుస్తాడా..? స్కార్ ను అంతం చేస్తాడా ? లాంటి విషయాలు తెలుసుకోవాలంటే వెండితెర పై ఈ సినిమాను చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :-
ఈ సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకులకు ఆ అడవి రాజ్యంలోకి వెళ్లి ఆ లోకంలో విహరిస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. పైగా అద్భుతమైన విజువల్స్ తో పాటు భారీ సాంకేతిక విలువలతో తెరకెక్కించబడటమే ఈ సినిమా ప్రధాన బలం. అలాగే ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల అయిన ఈ చిత్రానికి తెలుగు వర్షన్ లో.. సింబా పాత్రకు నాని, అలాగే స్కార్ పాత్ర కి జ‌గ‌ప‌తి బాబు, ముఫాస పాత్ర కి పి.ర‌విశంక‌ర్ డబ్బింగ్ చెప్పడంతో.. ప్రధాన పాత్రల ఎమోషన్ అండ్ పెయిన్ తెలుగు ప్రేక్షకులు బాగా ఓన్ అయింది. ముఖ్యంగా సింబా బాధను నాని తన వాయిస్ లోనే అద్భుతంగా పలికించారు.

 • అదేవిధంగా పుంబా పాత్రకు బ్రహ్మానందం, టీమోన్ పాత్ర‌కు ఆలీ డ‌బ్బింగ్ చెప్పడం వల్ల తెలుగు ‘ద ల‌య‌న్ కింగ్’లో మంచి ఫన్ కూడా వర్కౌట్ అయింది. ముఖ్యంగా బ్ర‌హ్మానందం – ఆలీ తమ కామెడీ టైమింగ్‌ తో మాడ్యులేషన్ తో మంచి కామెడీని పండించారు. ఈ సినిమాని 3డి ఆనిమేటెడ్‌ టెక్నాలజీతో తీసుకురావడం, అలాగే సినిమాలో మెయిన్ ఎమోషన్ చాల బలంగా ఉండటం బాగా ప్లస్ అయింది. మొత్తంగా డిస్నీ వారు ప్రస్తుత సాంకేతికని వాడుకొని, ముఫాస– సింబా కథని ఓ ఎమోషనల్ విజువల్ వండర్ గా తీర్చి దిద్దారు.

మైనస్ పాయింట్స్ :
ఎమోషనల్ గా సాగే రివేంజ్ స్టోరీతో సినిమా ఆకట్టుకున్నా.. కథ పరంగా తెలుగు వారికి రీసెంట్ బాహుబ‌లి చిత్రం గుర్తువ‌స్తుంది. అలాగే ఫస్టాఫ్ ను ఆసక్తికరమైన విజువల్స్ తో అక్కడక్కడ కాస్త కామెడీగా నడిపినా.. స్లోగా సాగే సీన్స్ తో కొన్నిచోట్ల స్క్రీన్ ప్లే ను నెమ్మదిగా నడిపారు. సెకెండ్ హాఫ్ లో కూడా కొన్ని సీన్స్ స్లోగా సాగుతాయి.

అలాగే మధ్యమధ్యలో వచ్చే బిట్ సాంగ్స్ కూడా కొంత ఇబ్బంది పెడుతాయి. కొంచెం టైట్ స్క్రీన్ ప్లే ఉండి ఉంటే ఈ సినిమా పూర్తి సంతృప్తికరంగా ఉండి ఉండేది. హ‌లీవుడ్ బెస్డ్ చిత్రం కాబ‌ట్టి ఇవ‌న్ని ప్రేక్ష‌కులు ప‌ట్టించుకొరు.

సాంకేతిక విభాగం :-
ఈ సినిమాకు సంబంధించి విభాగం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఈ సినిమాకు సంబంధించన ప్రతి క్రాఫ్ట్ అద్భుతంగా వుంది. సినిమాలో సాంకేతికంగా పెద్దగా ఎక్కడా ఎలాంటి లోపాలు కనిపించవు. వీ.ఎఫ్.ఎక్స్, కంప్యూర్ గ్రాఫిక్స్ దగ్గర నుంచీ కెమెరా వర్క్, నేపథ్య సంగీతం వరకూ ప్రతి క్రాఫ్ట్ వర్క్ చక్కగా కుదిరింది. చివరగా నిర్మాణ విలువలు అద్భుతం. లైవ్ యానిమేస‌న్ కేర‌క్టర్స్ ఎక్సప్రెష‌న్స్ అద్బుతం అని చెప్పాలి.

తీర్పు :-
ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య డిస్నీవారు సమర్పణలో 3డి ఆనిమేటెడ్‌ టెక్నాలజీతో వచ్చిన ఈ జంగిల్ యానిమేషన్ చిత్రం అద్భుతమైన విజువల్స్ తో మరియు కొన్ని ఎమోషనల్ సీక్వెన్స్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. మెయిన్ కంటెంట్ తో పాటు బలమైన ఎమోషనల్ సీక్వెన్స్ స్ అండ్ అద్భుతమైన విజువల్స్ బాగా అలరిస్తాయి. సింబా త‌న ల‌వ‌ర్ నాల మ‌ద్య వ‌చ్చే రొమాంటిక్ ఫైట్ లో వాటి హ‌వ‌భావాలు ముచ్చ‌టేస్తాయి. అలాగే ముసాఫా, త‌న భార్య పై చూపించే ప్రేమ‌, కొడుకు పై చూపించే ఆప్యాయ‌త చాలా చ‌క్క‌గా తెర‌కెక్కించారు. స్కార్ ని క్రూరంగా కాకుండా సింహ‌నికి గుంట న‌క్క తెలివితేట‌లు చూపించారు.. మ‌నం చూస్తుంది సింహ‌ల‌నే అయినా వాటి పాత్ర‌లు మ‌న‌కి బ‌లంగా గుర్తిండిపోతాయి చివ‌రిగా ‘ది లయన్ కింగ్’ పిల్లల నుంచీ పెద్దల వరకూ మంచి ఎమోషనల్ విజువల్ ట్రీట్ ఇస్తోంది. త‌ప్ప‌కుండా ఫ్యామిలి అంతా ముఖ్యంగా పిల్ల‌ల‌కి చూపించాల్సిన చిత్రం.

7 COMMENTS

 1. Знаете ли вы?
  Первая абсолютная чемпионка турнира Большого шлема похоронена в могиле для бедняков.
  Бывший наркокурьер, став премьер-министром Юкона, принимал законы против наркомании и наркоторговли.
  Биограф русского художника романтизировала историю его французской прародительницы вслед за Герценом.
  Китайскую пустыню засадили лесами и открыли там фешенебельный курорт.
  Роден назвал свои «Врата ада» напрямую, а его соотечественник только намекнул.

  0PB8hX.com

 2. Знаете ли вы?
  Фиктивно отменить рабство в Камбодже её короля заставили французские колонизаторы.
  Возможно, что американцы уже в 1872 году вмешались в канадские выборы.
  Персонажу французской комедии о Фантомасе советские подростки подражали всерьёз.
  Самцы косатки, обитающие в Британской Колумбии, всю жизнь живут с мамой.
  Биограф русского художника романтизировала историю его французской прародительницы вслед за Герценом.

  http://www.arbeca.net/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here