ధనుష్ ‘తూటా’ మూవీ రివ్యూ…

Director Gautham Menon's Enai Noki Paayum Thota starring Dhanush and Megha Akash has a solid storyline.

20
999

మూవీ పేరు : తూటా
విడుదల తేదీ : జనవరి 01, 2020
నటీనటులు : ధనుష్‌, మేఘా ఆకాష్‌, సునైనా, శశి కుమార్‌, సెంథిల్‌ వీర స్వామి.
దర్శకత్వం : గౌతమ్‌ మీనన్‌
సంగీతం : దర్బుక శివ
నిర్మాతలు : జి.రామకృష్ణా రెడ్డి, తాతా రెడ్డి
సినిమాటోగ్రఫర్‌ : జామూన్‌ టి జాన్‌, మనోజ్‌ పరమహంస, ఎస్‌ ఆర్‌, కథిర్‌,
ఎడిటర్‌: ప్రవీణ్‌ ఆంటోని

గౌతమ్‌ మీనన్‌ వాసుదేవ్‌ సినిమాల గురించి ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. ఆయన చిత్రాలన్నీ రొమాంటిక్‌ కమ్‌ ప్రేమతో ఆహ్లాదాన్ని ఇస్తాయి.. అయితే తాజాగా.. అదే కాన్సెప్ట్‌తో పాటు కాస్త యాక్షన్‌ కలిపి తెరకెక్కించిన సినిమానే ‘తూటా’. తమిళనాట ధనుశ్‌కి మంచి క్రేజ్ వుందన్న విషయం తెలిసిందే. అటే ధనుష్ క్రేజ్.. ఇటు గౌతమ్ మీనన్‌ క్రేజ్ రెండు కలవడంతో సినిమా మొదటి రోజే సక్సెస్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో ధనుష్ సరసన మేఘా ఆకాష్‌ నటించింది. కొత్త సంవత్సరం నాడే విడుదలైన ఈ మూవీ ధనుష్ ఫ్యాన్స్‌, సినీ ప్రేక్షకులకు మంచి కిక్ ఇచ్చింది. గౌతమ్-ధనుష్‌ల తూటా గమ్యాన్ని చేరిందా..? గురి తప్పిందా..? అనేది తెలియాలంటే రివ్యూ చూడాల్సిందే మరి.

‘తూటా’ కథ :-
రఘు (ధనుశ్), గురుమూర్తి (శశికుమార్) ఇద్దరూ అన్నదమ్ముళ్లు. రాజమండ్రి వీరి సొంతూరు. లైఫ్ సాఫీగా సాగుతున్న టైమ్‌లో గురు ప్రేమించిన అమ్మాయిని కోల్పోతాడు. ఆ బాధతో.. ఇంట్లో వాళ్లను కూడా ఇబ్బంది పెట్టకూడదని భావించిన గురు ఇంటికి దూరమవుతాడు. అయితే.. గురు ఏమయ్యాడు..? ఎక్కడికెల్లాడు..? ఏమైపోయాడు..? అంటూ కుటుంబ సభ్యులు వేయి కళ్లతో వేచి చూస్తుంటారు. తల్లిదండ్రులు రాజమండ్రిలో.. రఘు సిటీలో పెద్ద చదువుల కోసం వస్తాడు. ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ ఉన్నప్పటికీ అన్నయ్య ఏమయ్యాడో అనే ఆందోళన మాత్రం రఘులో పోలేదు. ఇక హీరోయిన్ విషయానికొస్తే.. చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకున్న లేఖ (మేఘా ఆకాశ్), కుమార్ అనే వ్యక్తి ఆశ్రయం పొందుతుంది. లేఖను చిన్నప్పటికీ పెంచి పోషించిన కుమార్ మంచి చదవులు చదివిస్తాడు. అయితే ఆమెను ఇన్ని రోజులు పెంచి, చదివించినందుకు గాను రుణంగా లేఖను హీరోయిన్‌గా చేసి క్యాష్ చేసుకోవాలని యాక్టింగ్‌లో దించుతాడు. ఆమెకు ఇష్టం లేకపోయినప్పటికీ.. ఎదురు చెప్పలేక.. ఎక్కడికైనా వెళ్లిపోతే వెతుక్కుంటూ వచ్చి ఏం చేస్తాడో ఏమో అని అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని ఒత్తిడితో సినిమాల్లో నటిస్తుంటుంది. రఘు చదువుతున్న కాలేజీలోనే షూటింగ్‌ జరుగుతుంటుంది. మొదటిసారిగా అతణ్ణి అక్కడ చూస్తుంది.. అలా వీరిద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది.. ఆ ప్రేమను పెళ్లి పీటలుదాకా తీసుకెళ్లాలని భావించిన ఈ జంట.. రఘు ఇంటికి తీసుకెళ్లి తల్లిదండ్రులకు పరిచయం చేసి ఈ అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టి మరీ ఒప్పిస్తాడు.

ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు!
అయితే.. అలా ఒక నెలరోజుల పాటు రఘు ఇంట్లోనే గడిపేస్తారు. అంతా బాగానే ఉంది.. ఇక పెళ్లి చేసుకుందామనుకునే టైమ్‌కు కుమార్.. అడ్రస్ కనుక్కొని రాజమండ్రి వచ్చి వారిని బెదిరించి.. బయపెట్టించి లేఖను తీసుకెళ్తాడు. మళ్లీ యథావిథిగా ఆమెను సినిమాల్లో యాక్టింగ్ చేపిస్తుంటాడు. అయితే అసలు అన్నయ్య కనిపించకుండా పోయాడన్న బాధలో ఉన్న రఘు అండ్ ఫ్యామిలీకి.. లేఖ కనిపించకుండా పోవడంతో మరో టెన్షన్ తోడైంది. ఒకానొక సందర్భంలో ఆమెను ముంబై తీసుకెళ్తాడు కుమార్.. అయితే అక్కడ ఆమె ప్రమాదంలో ఉన్న టైమ్‌లో రఘు అన్నయ్య గురుమూర్తి వచ్చి రక్షించి ఆమెను తనతో తీసుకెళ్తాడు. నాలుగేళ్ల తర్వాత రఘుకు ఫోన్ కాల్ వస్తుంది..? నువ్ కచ్చితంగా ముంబైకి రావాలి.. అనిమాట్లాడిన లేఖ.. అన్నయ్య గురు గురించి కూడా చెప్పేస్తుంది. అసలు ఎప్పుడో మిస్సయిన గురు ముంబైలో ఎలా ప్రత్యక్షమయ్యాడు..? లేఖకు ఎలా పరిచయం అయ్యాడు..? లేఖ-రఘు ఇద్దరూ లవర్స్ అని ఎలా గురుకు తెలిసింది..? ఆయన నిజంగానే రఘు అన్నయ్యేనా..? కాదా అనే ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లుండే కథ తెలియాలంటే థియేటర్‌కు వెళ్లి సినిమా చూడాల్సిందే మరి.

ప్లస్ పాయింట్స్:-
– ధనుష్ నటన
– బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదుర్స్
– సాంగ్స్ సూపర్బ్
– స్క్రీన్ ప్లే బాగుంది
– యాక్షన్ సీన్స్ బాగున్నాయ్

మైనస్ పాయింట్స్:-
– క్లైమాక్స్‌ (చాలా సింపుల్‌గా తేల్చేశాడు)
– కామెడీ లేకపోవడం (కామెడీకి అవకాశం ఇవ్వకపోవడమే పెద్ద లోపం)

సాంకేతిక విభాగం :-
కథకు తగ్గట్టుగా పాటలు.. యాక్షన్‌ సన్నివేశాలకు తోడయ్యే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఒక్క మాటలో చెప్పాలంటే సినిమాకు ఊపిరి పోసింది ఇదే. ప్రవీణ్ ఆంటోని ఎడిటింగ్ పర్లేదు. యాక్షన్ థ్రిల్లర్స్‌కి సుదీర్ఘమైన నిడివి కంటే కూడా క్రిస్పీగా ఉంటే నిడివి ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. స్క్రీన్ ప్లే అండ్ ఫిల్మ్ మేకింగ్ అంటే టక్కున గుర్తొచ్చే గౌతమ్.. మొనాటమీ ఎక్కువైంది. ఎక్కడా ఎంటర్టైన్మెంట్‌కి తావులేకుండా ఆయన ‘తూటా’ మూవీని సీరియస్‌గా నడిపించాడని చెప్పుకోవచ్చు. కథలో డిఫరెంట్ లేయర్స్ ఉన్నప్పటికీ ప్రేక్షకుడికి ఆసక్తి కలగపోగా కాస్త బోరింగ్‌గా అనిపించింది.

రణరంగం.కామ్ విశ్లేషణ:-
ధనుష్‌, మేఘా ఆకాష్‌ల నటన చాలా సింపుల్‌గా ఉంది. ఒకరంటే ఒకరికి చచ్చేంత ఇష్టం ఉన్న లవ్ బర్డ్స్‌గా జీవించారు. వారిద్దరి మధ్య నడిచే రొమాన్స్‌, కెమిస్ట్రీ సీరియస్‌గా సాగే కథలో ప్రేక్షకుడికి కొంచెం ఉపశమనం కలిగించేలా ఉందని చెప్పుకోవచ్చు. యాక్షన్ కథల్లో నటించాలంటే ధనుష్ తర్వాతే మరెవరైనా అని మరోసారి నిరూపించుకున్నాడు. మరీ ముఖ్యంగా.. ధనుష్ ఇదివరకు సినిమాలతో పోలిస్తే.. ఆయన స్టైయిల్, కాస్త లావుగా అనిపించడం ఇలా చాలా మార్పులు వచ్చాయ్. ఒంటిచేత్తో ధనుష్‌ సినిమాను నడిపాడని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. యాక్షన్‌ సన్నివేశాలతో పాటు, ఉత్కంఠ రేపే సీన్స్‌ నందు హీరో నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. ప్రధాన విలన్‌ రోల్‌ చేసిన సేతు వీరస్వామి నటన పాత్రకు తగ్గట్టుగా వాస్తవానికి దగ్గరా సాగింది. ధనుష్‌ ఫ్రెండ్‌గా చేసిన సునైన తన పాత్ర పరిధిలో ఆకట్టుకుంది. మరోవైపు.. పోలీస్ ఆఫీసర్‌గా ధనుశ్ అన్నయ్య చేసిన ఆపరేషన్ దేని గురించి? అనే విషయాన్ని క్లారిటీగా చెప్పడంలో డైరెక్టర్‌ ఇంకాస్త శ్రద్ధపెట్టుంటే బాగుండేది. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రీ క్లైమాక్స్‌ను ఇంట్రెస్టింగ్ పరుగులు తీయించిన దర్శకుడు, అంతకుమించిన ముగింపును ఇవ్వడంలో విఫలమయ్యాడు. కథ ఎక్కడికో తీసుకెళ్లడం.. మళ్లీ ఎక్కడికో రావడంతో కాస్త గజిబిజి అనిపించింది.

రణరంగం ట్యాగ్‌లైన్ : ‘తూటా’ కాస్త స్లోగానే దిగింది.
రణరంగం రేటింగ్ : 3/5

20 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here