నలుగురి ప్రాణం తీసిన వివాహేతర సంబంధం

6
674

వివాహేతర సంబంధం ఇద్దరు చిన్నారులు సహా నలుగురి ప్రాణం తీసింది. వీరిలో ఒక చిన్నారిని ముందుగానే హత్యచేసి అనంతరం ఓ చిన్నారి సహా మామాకోడళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్పీఎఫ్ పోలీసుల కథనం ప్రకారం… తమిళనాడులోని వేలూరు జిల్లా కనియం బాడి సమీప నెలవాయ్‌ గ్రామానికి చెందిన క్యాబ్‌ డ్రైవర్‌ ధనశేఖర్‌ భార్య జయంతికి… వరుసకు పెద్ద మావ అయిన గోపాలకృష్ణన్‌(ధనశేఖర్‌ పెదనాన్న)తో కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉంది. గత డిసెంబరు 22న జయంతి, గోపాల కృష్ణన్‌, ఆమె ఇద్దరు పిల్లలైన మహాలక్ష్మి(6), శ్రీలక్ష్మి(3)లను తీసుకుని ఇంటి నుంచి బయటకు వచ్చేశారు.

తిరుచ్చి, తిరువణ్ణామలై తదితర ప్రాంతాలకు వెళ్లి ఏకాంతంగా గడిపారు. అయితే వారి ఏకాంతంగా ఉండటాన్ని పెద్ద కుమార్తె మహాలక్ష్మి చూసింది. దీంతో విషయాన్ని ఎక్కడ బయటపెడుతుందోనన్న భయంతో చిన్నారిని గత నెల 27న వేళంగిణి అతిథిగృహంలో గోపాలకృష్ణన్‌, జయంతి కలిసి చంపేశారు. మరోవైపు గోపాలకృష్ణన్‌ తన భార్యా పిల్లలను కిడ్నాప్‌ చేశాడని ధనశేఖర్‌ రాయవేలూరు పోలీసులను ఫిర్యాదు చేశాడు. అదే సమయంలో మహాలక్ష్మి హత్యోదంతం వెలుగుచూడటంతో పోలీసులు కిడ్నాప్‌ కేసు నమోదు చేసుకుని, ప్రత్యేక దళాన్ని రంగంలోకి దింపారు. ఈ నేపథ్యంలో పోలీసులు తమను అరెస్టు చేయడానికి వస్తున్నారనే భయంతో.. జయంతి, గోపాలకృష్ణన్‌ గురువారం చిన్నారి శ్రీలక్ష్మితో కలిసి విజయవాడలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. మృతదేహాల వద్ద లభ్యమైన ఆధార్‌కార్డులను బట్టి రైల్వే పోలీసులు వారి ఆచూకీని కనుగొన్నారు.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here