‘నవరత్నాల్లో ఏ రత్నం ఇవ్వాలో తెలియని అయోమయంలో జగన్’

0
301

వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై తెలుగుదేశం పార్టీ స్టార్ క్యాంపెయినర్ వంగవీటి రాధాకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, నవరత్నాలు ప్రకటించి ఏ రత్నం ఇవ్వాలో తెలియని అయోమయంలో జగన్‌ ఉన్నారని వంగవీటి రాధా ఎద్దేవా చేశారు. నమ్మించి నట్టేట ముంచడం జగన్ నైజమని ఆయన విమర్శించారు. ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని జగన్.. అభ్యర్థులను నమ్మించి కోట్లు ఖర్చు పెట్టిస్తారని పేర్కొన్నారు. తీరా ఎన్నికల సమయం వచ్చేసరికి టికెట్ ఇవ్వకుండా ఎమ్మెల్సీ ఇస్తామంటూ మభ్యపెట్టడం జగన్‌కు పరిపాటిగా మారిందని వంగవీటి రాధా విమర్శించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here