నవ్యాంధ్ర రెండో ముఖ్యమంత్రిగా ‘జగన్ అనే నేను..’

0
117

నవ్యాంధ్ర రెండో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం వేదికగా జగన్ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్.. వైఎస్ జగన్‌ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. సరిగ్గా 12:23 గంటలకు వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం ప్రారంభించారు. వైఎస్ జగన్ కింది విధంగా ప్రమాణ స్వీకారం చేశారు.

వైఎస్ జగన్ అనే నేను… !
“వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అను నేను.. శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంత:కరణ శుద్ధితో నిర్వర్తిస్తానని, భయం కానీ, పక్షపాతం గానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన, లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్నీ.. నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప, ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఏ వ్యక్తికీ లేదా వ్యక్తులకు తెలియపరచనని.. లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను” అని జగన్ ప్రమాణ స్వీకారం చేశారు.

ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి తెలంగాణ సీఎం కేసీఆర్, ఒడిసా సీఎం నవీన్‌పట్నాయక్, డీఎంకే అధినేత స్టాలిన్‌తో తెలంగాణకు చెందిన మంత్రులు, ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, అశేష అభిమానులు, వైసీపీ కార్యకర్తల తరలివచ్చారు. జగన్ చాలా భావోద్వేగం ప్రమాణం చేశారు. ఇవాళ వైఎస్ జగన్ ఒక్కరే ప్రమాణం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here