నాచారం సభలో కేటీఆర్.. భారీ జన సందోహం

0
405

మరికొద్ది రోజుల్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ నేత, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నాచారం డివిజన్ లో పర్యటించారు. ఈ మేరకు అక్కడి ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన కేటీఆర్.. రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక జరిగిన అభివృద్ధి పనుల గురించి వివరించారు. టీఆర్ఎస్ తరఫున మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మర్రి రాజశేఖర్ రెడ్డికి మీ అమూల్యమైన ఓటును వేయాల్సిందిగా ఆయన కోరారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ”ఆ గట్టునుంటావా.. ఈ గట్టునుంటావా..” అంటూ సభకు వచ్చిన జనాల్లో ఉత్సాహాన్ని రేకెత్తించడం విశేషం.

కేటీఆర్ రాకతో నాచారం పరిసర ప్రాంతాల్లోని జనం భారీ ఎత్తున తరలి వచ్చారు. భారీ జన సందోహం నడుమ కేటీఆర్ స్పీచ్ రసవత్తరంగా సాగింది. ఈ సభలో ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి, నాచారం డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షులు మేడల మల్లికార్జున్ గౌడ్, కాంటెస్టెడ్ కార్పొరేటర్ మేడల జ్యోతి మల్లికార్జున్, నాచారం ప్రస్తుత కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్, రామంతాపూర్ కార్పొరేటర్ గంధం జ్యోశ్న, ఇతర స్థానిక నేతలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here