పాక్‌ని రెచ్చగొట్టొద్దు: హీరోయిన్ మహీరాఖాన్

0
229

పాక్‌ను రెచ్చగొట్టొద్దని.. సర్జికల్ స్ట్రైక్స్‌కు దిగి భారత్ పెద్ద తప్పు చేసిందంటూ హీరోయిన్ మహీరాఖాన్ ట్వీట్ చేయడం సంచలనం రేపుతోంది. పాక్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో మనవరాలు ఫాతిమా భుట్టో చేసిన ట్వీట్‌పై స్పందించిన మహీరా వరుస ట్వీట్స్ చేసింది. ఈ ట్వీట్స్‌లో ఒకటి మీడియాను ఉద్దేశించి చేసింది. ‘‘సర్జికల్ స్ట్రైక్స్‌కు దిగి భారత్ పెద్ద తప్పు చేసింది. పాక్‌ను రెచ్చగొట్టి యుద్ధానికి కాలు దువ్వొద్దు. ఇలాంటి చర్యలు హేయమైనవి. మళ్లీ ఇరుదేశాల మధ్య సాధారణ పరిస్థితులు రావాలి’’ అంటూ ట్వీట్ చేసింది.

మరో ట్వీట్‌లో… ‘‘మనుషులుగా ఇలాంటి పరిస్థితులు మనం అర్థం చేసుకోవాలి. ఇలాంటి సమయంలో మీడియా మరింత బాధ్యతగా వ్యవహరించాలి. ఇది శాంతిని బోధించడానికి కేటాయించాల్సిన సమయం. ఇలాంటి సమయంలో మీడియా రెచ్చగొట్టే విధంగా వ్యవహరించకూడదు. ఎల్లప్పుడూ శాంతి నెలకొనాలని నా ప్రార్థన’’ అంటూ మరో ట్వీట్ చేసింది. మహీరా షారుఖ్ ఖాన్ సరసన ‘రయీజ్’ సినిమాలో హీరోయిన్‌గా నటించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here