ప్రణబ్‌కు భారతరత్న.. అన్నగారికి మళ్లీ హ్యాండిచ్చారు!

0
661

భారతదేశంలో పౌరులకు అందే అత్యుత్తమ పురస్కారమైన ‘భారతరత్న’ ఆంధ్రుల ఆరాధ్యుడు, అన్నగారు ఎన్టీఆర్‌కు ఇవ్వాలనే డిమాండ్ గత కొన్నేళ్లుగా ఉంది. అయితే ఈసారైనా కచ్చితంగా అన్నగారిని అత్యున్నత పురస్కారం వరిస్తుందని తెలుగు ప్రజలు భావించారు. తాజాగా ప్రకటించిన జాబితాలో ఎన్టీఆర్ లేకపోవడం గమనార్హం.

భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో మరో ఇద్దరి పేర్లు ప్రకటించింది. దీంతో మరోసారి రామారావుకు హ్యాండిచ్చినట్లైంది. అన్నగారి పేరు పురస్కార గ్రహితల్లో లేకపోవడంతో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని ప్రతీ ఏటా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

భారతరత్న వరించింది వీరినే..
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ
సామాజిక కార్యకర్త చాందికాదాస్ అమృత్‌రావ్ (మరణాంతరం)
గాయకుడు భూపేన్ హజారికా (మరణాంతరం)లకు అత్యున్నత పురస్కారం ఇస్తున్నట్లు తాజాగా ప్రకటన వచ్చింది. కాగా వీరందరూ రిపబ్లిక్ డే జనవరి 26న రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారాల బహుకరణ జరగనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here