“ప్రధానిగా మోదీ.. నేను ఎంపీగా గెలవడం ఖాయం”

0
111

నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని కావడం.. తాను చేవెళ్ల ఎంపీగా గెలవడం ఖాయమని జనార్ధన్ రెడ్డి చెప్పుకొచ్చారు. సోమవారం నాడు ఎల్బీ స్టేడియంలో బీజేపీ విజయ సంకల్ప సభ జరిగింది. ఈ సభలో జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. చేవెళ్ల అభివృద్ధికి దూరంగా ఉందన్నారు. గత పాలకులు ఈ చేవెళ్లకు చేసిందేమీ లేదని తనను గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామని ఆయన తెలిపారు. ప్రధాని మోదీ దేశాన్ని అభివృద్ధి బాటలో నడపాలని పాటుపడుతున్నారన్నారు. అదే రీతిలో తాను కూడా చేవెళ్ల కోసం పనిచేస్తానని ఈ సందర్భంగా ఆయన నియోజకవర్గ ప్రజలకు హామీ ఇచ్చారు. విద్యార్థులు, పేదల కోసం మోదీ అనేక పథకాలు ప్రవేశపెట్టారని జనార్ధన్ రెడ్డి తెలిపారు.

ఎల్బీ స్టేడియంలో జరిగిన ఈ సభకు పెద్ద ఎత్తున జనాలు, కార్యకర్తలు నేతలు తరలివచ్చారు. ఎంపీ అభ్యర్థులు రామచందర్ రావు, కిషన్ రెడ్డి, ఎస్ కుమార్, రఘునందన్ రావు, శ్యామసుందర్ రావు, భగవంతరావుతో పాటు పలువురు నేతలు హాజరయ్యారు. కాగా.. తాజాగా బీజేపీలో చేరిన మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి, మాజీ మంత్రి విజయ రామారావు సభకు హాజరై విజయవంతం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here