‘ప్రేమ పిపాసి’ రివ్యూ..

22
787

ర‌చ‌న‌, ద‌ర్శక‌త్వం: ముర‌ళీస్వామి
నిర్మాత‌: పిఎస్‌ రామ‌కృష్ణ‌
న‌టీన‌టులు: జిపిఎస్, క‌పిలాక్షి మ‌ల్హోత్రా, సొనాక్షి వ‌ర్మ, జ్యోతి రాజ్‌పుత్‌, మ‌మ‌త శ్రీ‌చౌద‌రి, అంకిత‌, బిగ్‌బాస్ ఫేమ్ బంద‌గి క‌ర్ల, సంజ‌న చౌద‌రి, సుమ‌న్, భార్గవ్‌, షేకింగ్ శేషు, జ‌బ‌ర్దస్త్ రాజ‌మౌళి, ఫ‌స‌క్ శ‌శి, ఫ‌న్ బ‌కెట్ భ‌ర‌త్ త‌దిత‌రులు
సంగీతం: ఆర్స్‌
సినిమాటోగ్రఫీ: తిరుమ‌ల రోడ్రిగ్జ్‌
ఎడిటింగ్ : ఎస్‌. శివ‌కిర‌ణ్‌

తెలుగు ప్రేక్షకులు ఈ మధ్య కొత్త కథలు, బోల్డ్ కంటెట్ ఉన్న కథలకు ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారు. అంతే కాదు కాస్త మసాలా జోడిస్తే.. కంటెంట్ ఉందా..? విషయం ఉందా..? లేదా అనేది చూడకుండా తెగ ఎగబడి చూసేస్తున్నారు. ఇందుకు కారణం ‘అర్జున్ రెడ్డి’ సినిమానే. ఆ తర్వాత పలు సినిమాలు ఇదే పంథాలో వచ్చినప్పటికీ పెద్దగా వర్కవుట్ అవ్వలేదు. అయితే తాజాగా వచ్చిన ‘ప్రేమ పిపాసి’ కూడా ‘అర్జున్ రెడ్డి’ తలదన్నేలా సీన్స్ ఉండటం.. బోల్డ్ కంటెంట్ ఉండటంతో సినీ ప్రియులు, లవర్స్ థియేటర్స్‌కు క్యూ కడుతున్నారు. అయితే.. అసలు ‘ప్రేమ పిపాసి’ సినిమా విషయంలో ఏ మాత్రం విషయముంది..? సినిమాపై ప్రేక్షకులు ఏమంటున్నారు..? అసలు కథ ఎలా ఉంది..? అనే ఆసక్తికర, ఇంట్రెస్టింగ్ విషయాలు ‘రణరంగం’ అందిస్తున్న ఈ రివ్యూలో చూసేద్దాం.

క‌థ‌ :-
ఆవారాగా తిరిగే బావ (జీపీఎస్) కనిపించిన ప్రతి అమ్మాయిని ప్రేమలో పడేయడటమే పనిగా పెట్టుకుంటాడు. ఆ అమ్మాయితో అవసరం తీరగానే వదిలేసి వేరొకర్ని చూసుకుంటూ ఉంటాడు. అయితే ఇదివరకటిలా కాకుండా అనుకోకుండా కోటీశ్వరుడు (సుమన్) కూతురు బాలా (కపిలాక్షి మల్హోత్రా)ని చూసి చాలా సిన్సియర్‌గా ప్రేమిస్తాడు. ఆమె ఎంతకీ ఒప్పుకోకపోవడంతో ఆ బ్యూటీ కోసం విశాఖపట్నం పయనమవుతాడు. అయితే.. అప్పటి వరకూ అమ్మాయిలతో తిరగడమే పనిగా పెట్టుకుని అతను ఒక్కసారిగా అమ్మాయి కోసం తన ప్రాణాన్ని పనంగా ఎందుకు పెట్టాడు..? ఆమెను అంత గాఢంగా ఎందుకు ప్రేమించాడు..? ఆ అమ్మాయికి బావకు పడిందా..? ఇంతకీ బావ ఎవరు..? చివరకు ఆ అమ్మాయిని దక్కించుకున్నాడా? హీరో భగ్న ప్రేమికుడుగా ఎందుకు మారాడు..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియాలంటే థియేటర్‌కు వెళ్లి సినిమా చూడాల్సిందే.

సినిమా ఎలా ఉంది..!?
ఇన్ని రోజులూ అమ్మాయిలో ఆవారాగా తిరిగే అతని సిన్సియర్‌గా ప్రేమలో పడి ఓడిపోవడం.. ఆత్మహత్యాయత్నంకు సంబంధించిన సీన్స్‌ డైరెక్టర్ చాలా అట్రాక్టివ్‌గా తెరకెక్కించాడు. ఇదే దర్శకుడి పనితనమేంటో తెలియజేస్తుంది. ఫస్టాఫ్‌ మొత్తం బాగా ఇంట్రెస్టింగ్‌గా.. ఎన్నో ట్విస్ట్‌లు, ఉత్కంఠలతో నడిపించేశాడు. మరీ ముఖ్యంగా గతం గురించి చాలా చక్కగా చూపించాడు. అలా ఫస్టాప్ మొత్తం మంచి ఊపు పెరిగినట్టుగానే చూపించాడు. మరీ ముఖ్యంగా.. అమ్మాయిలను ట్రాప్ చేసే ట్రిక్స్, ఈ కాలంలో అమ్మాయిలు ఎలా ఉన్నారో కళ్లకు కట్టినట్టు చూపించిన ఫీలింగ్ సదరు ప్రేక్షకుడికి కలుగుతుంది. శ్రుతీ, కోమలి, కీర్తి అంటూ ఒకరి తరువాత ఒకర్ని ట్రాప్ చేసే సీన్స్‌తోనే ప్రథమార్థం మొత్తం నిండినట్టు అనిపిస్తుంది. అలా సుమన్, బాలా (సోనాక్షి) ఎంట్రీతో ఫస్టాఫ్ ముగుస్తుంది. ఫస్టాప్ మొత్తం అన్నీ సీన్స్ చాలా బాగానే ఆకట్టుకున్నాయి. ఎప్పుడైతే సుమన్ రంగంలోకి దిగుతాడో అప్పుడు సినిమా కొత్త మలుపు తిరుగుతుంది. సుమన్ పాత్ర చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఇక సెకాండాఫ్ మొత్తం ప్రేమించిన అమ్మాయి కోసం హీరో పడ్డ కష్టం..? ఆ అమ్మాయి పడిందా లేదా..? అమ్మాయి కాదంటే అతను ఎలా ఒప్పించాడు..? అనేది సెకాండాఫ్‌లో మంచిగానే చూపించాడు. మొత్తానికి చూస్తే ఫస్టాప్, సెకాండాఫ్ రెండూ ఇంట్రెస్టింగ్‌గానే సాగాయని చెప్పుకోవచ్చు.

‘జబర్దస్త్’ కామెడీ!
చాలా ఇంట్రెస్ట్టింగ్‌ సాగే ఈ కథలో చాలా వరకు అన్ని సీన్లు అదుర్స్ అనిపించాయ్. మరీ ముఖ్యంగా మ‌ధ్య మధ్యలో జబర్దస్త్ ఆర్టిస్ట్‌లు చేసే కామెడీ చాలా బాగా ఆకట్టుకుంది. షేకింగ్ శేషు, జ‌బ‌ర్దస్త్ రాజ‌మౌళి, ఫ‌స‌క్ శ‌శి, ఫ‌న్ బ‌కెట్ భ‌ర‌త్ కామెడీ పండించారు. సీరియస్ కథలోనూ కామెడీ పండించడం.. మామూలు విషయమేమీ కాదు.. డైరెక్టర్ ఇక్కడ చాకచక్యంగా బోర్ కొట్టకుండా మంచిగానే కామెడీ ప్లాన్ చేశాడని చెప్పుకోవచ్చు. అంతేకాదు.. ఆర్టిస్ట్‌లను మంచిగానే పట్టుకోవడంతో జనాలకు కామెడీ కొదువ లేకుండా పోయింది. హీరో ఫ్రెండ్‌గా ఫన్‌ బకెట్‌ భార్గవ్‌ తనదైన శైలిలో పంచ్‌‌ల వర్షం కురిపించాడు. ఇక మిగిలిన రాజమౌళి, షేకింగ్ శేషు కనిపించేది కొద్దిసేపే అయినా పేరడీ పాటలతో థియేటర్‌లో నవ్వులు పూయించారు.

న‌టీన‌టుల న‌ట‌న‌..:-
హీరో, హీరోయిన్, సుమన్ వారి వారి పాత్రల్లో ఒదిగిపోయారు. ఇక ఐదుగురు హీరోయిన్స్‌ విషయానికి వస్తే వారికిచ్చిన పాత్రలకు న్యాయం చేశారని చెప్పుకోవచ్చు. హీరోగా ప‌రిచ‌య‌మైన జీపీఎస్ త‌న‌కు తొలి చిత్రమే అయినా ఎక్కడా ఆ ఛాయ‌లు క‌నిపించ‌లేదు. తనలోని నటనను బయటపెట్టి ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నాడని ఈ సినిమా ద్వారా చెప్పవచ్చు. ఫ‌స్టాహాఫ్‌ మొత్తం రొమాంటిక్.. సెకండాఫ్‌లో ఎమోష‌న‌ల్ సీన్‌ల‌ు పండించేశాడు. క‌పిలాక్షి మ‌ల్హోత్రా త‌న పాత్ర ప‌రిధిమేర‌కు న‌టించి మెప్పించింది. అంతేకాదు గ్లామ‌ర్ పరంగా కూడా ఎలాంటి మొహమాటం లేకుండా చేసేసింది. ఈ సినిమా మొత్తానికి సుమన్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడు.

సాంకేతిక నిపుణులు:-
సినిమా అనే ఫీలింగ్ రాకుండా రియ‌లిస్టిక్ ల‌వ్‌స్టోరీగా దర్శకుడు చూపించే ప్రయత్నాన్ని మెచ్చుకోవచ్చు. క‌థా, క‌థ‌నాల విష‌యంలో మ‌రిన్ని జాగ్రత్తలు తీసుకునే ఉంటే ఇంకాస్త బాగుండేది. ప్రేమ‌క‌థ కావడం దానికి రొమాన్స్, ఎమోషనల్ యాడ్ అవ్వడంతో సదరు ప్రేక్షకుడికి కావాల్సినవన్నీ ఈ సినిమాలో దొరికాయి. సినిమాటో గ్రాఫ‌ర్ తన వంతు పాత్రని స‌మ‌ర్థవంతంగా పోషించి సినిమాకు అడిషనల్ హంగుల్ని కూర్చాడు. ఫొటోగ్రఫీ చాలా బాగుంది. సినిమాకు సంగీతం, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. అయితే ఎక్కడో మ్యూజిక్‌లో ఇంకా కొరత అనిపిస్తోంది.. ఇంకాస్త దృష్టిపెట్టుంటే బాగుండేది. ఎడిటింగ్ కూడా మరీ అంత బాగలేదు కానీ పర్లేదనిపించింది. నిర్మాత విషయానికొస్తే.. ఫస్ట్ మూవీ అయినా ఖర్చులు దగ్గర ఎక్కడా రాజీపడకుండా నిర్మించేశారు.. నిర్మాణ విలువలు బాగున్నాయ్.

ప్లస్, మైనస్ పాయింట్స్ ఇవీ..
సినిమా ఫస్టాప్, సెకాండాఫ్ పర్లేదు అనిపించినప్పటికీ చాలా మైనస్ పాయింట్సే ఉన్నాయ్. ‘ప్రేమ పిపాసి’ అనేది టైటిల్‌ వరకే కానీ.. నిజమైన ప్రేమ ఎక్కడా కనిపించకపోగా కథ మొత్తం కామం చుట్టూనే తిప్పడంతో అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఎంతసేపూ కథానాయకుడి కోరికలపైనే దృష్టిసారించిన డైరెక్టర్.. అమ్మాయిల్లో నిజమైన ప్రేమలేదనే ఒక నిందను వాళ్లపై వేయడం ఎంతవరకు సమంజసం. మరీ ముఖ్యంగా.. జేబులో కండోమ్స్ ప్యాకెట్.. చేతిలో మందు బాటిల్ పట్టుకుని తిరిగే ఈ కథానాయకుడు, ప్రేమలో నిజమైన .. నిజాయితీ కలిగిన అమ్మాయి కోసం అన్వేషిస్తున్నట్టుగా చెప్పడంతో సినిమా నవ్వులపాలైంది. ఎంతసేపూ తాగడం, ఎక్కడిపడితే అక్కడే పడిపోవడం, బయటికొచ్చినప్పుడు అమ్మాయిలను వెంటపడటం.. లైన్లో పెట్టేయడం తప్ప పెద్దగా ఇంట్రెస్టింగ్‌గా ఏమీ చూపించకపోవడంతో దర్శకుడు ఆకట్టుకోలేకపోయాడు. కథాపరంగా హీరోకు గానీ .. హీరోయిన్‌కి గాని ఎలాంటి కుటుంబ నేపథ్యాలు లేవు.. దీంతో పెద్ద ఎమోషన్స్‌ లేవ్. సినిమాలో ఎంతసేపూ శృంగారం పండించాడే తప్ప మెయిన్‌ హీరోయిన్‌గా పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. ఒక్కమాటలో చెప్పాలంటే పూర్తిగా రొమాన్స్ పైనే ఆధారపడిపోయింది. అయితే ప్రేక్షకులంతా శృంగారాన్నే ఆశిస్తారని.. ఇప్పుడు ట్రెండ్ అంతా అదే ఫాలో అవుతున్నారనే ఉద్దేశంతో డైరెక్టర్ తీశాడు కానీ.. ఆ వ్యవహారాలన్నీ ‘అర్జున్ రెడ్డి’, ‘ఏడు చేపల కథ’, ‘డిగ్రీ కాలేజ్’ సినిమాలకే అయిపోయిందనే విషయం డైరెక్టర్ తెలుసుకోవాలి. మొదటి రోజు ఏదో ఆశించి జనాలు క్యూ కట్టారు.. మరి మున్ముంథు కలెక్షన్ల పరంగా ఏ మాత్రం నిర్మాతకు సంపాదించిపెడుతుందో వేచి చూడాల్సిందే.

రణరంగం రేటింగ్ : 3/5
రణరంగం ట్యాగ్‌లైన్ : ‘ప్రేమ పిపాసి’ని మరీ ఓవర్‌గా చూపించేశాడు!

 

22 COMMENTS

 1. Знаете ли вы?
  Убийца с руками-клешнями избежал тюрьмы, но позже сам был убит.
  Рассказ английского писателя был экранизирован в СССР раньше, чем опубликован его английский оригинал.
  Советский разведчик-нелегал создал в Европе разведгруппу, успешно проработавшую всю войну.
  Во время немецкой оккупации Украины радио на украинском языке вещало из Саратова и Москвы.
  Самцы косатки, обитающие в Британской Колумбии, всю жизнь живут с мамой.

  http://0pb8hx.com

 2. Знаете ли вы?
  Крейсер «Берик» на рейде в Девонпорте
  Мама и четверо детей снимают фильмы о своей жизни во время войны.
  В игре про выгорание отражён печальный личный опыт главного разработчика.
  Старейший депутат Палаты представителей проработал в Конгрессе США почти до 92 лет.
  Иракский физрук получил мировую известность под псевдонимом «ангел смерти».

  arbeca

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here