ఫిల్మ్‌నగర్‌లో చలివేంద్రం ప్రారంభించిన ‘మా’

chalivendram at film chamber started by movie artists association (MAA)

0
210

ఫిలింనగర్ ఫిలించాంబర్ వద్ద మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ప్రారంభించారు.. ఈ కార్యక్రమంలో మా అధ్యక్షుడు నరేష్ విజయ్ కృష్ణ, జనరల్ సెక్రటరీ జీవితారాజశేకర్, మా ట్రెజరర్ రాజీవ్ కనకాల, జాయింట్ సెక్రటరీ శివబాలాజీ తదితరులు పాల్గొన్నారు..

మా అధ్యక్షుడు నరేష్ విజయకృష్ణ మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం మా ఆద్వర్యంలో చలివేంద్రం ఛాంబర్ వద్ద పెట్టడం ఆనవాయితీ గా వస్తుంది. ఈ సంవత్సరం కూడా చలివేంద్రం పెట్టాలని నిర్ణయించుకుని ఈరోజు జీవిత గారి చేతుల మీదుగా ప్రారంభించాం. 47 డిగ్రీల ఎండ తీవ్రత ఎక్కువగా వుంది. తెలంగాణ ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఈ హీట్ వేవ్ ని దృష్టిలో పెట్టుకొని చలివేంద్రం స్టార్ట్ చేసాం. ఇది నెలరోజుల పాటు జూన్ 9వరకు కొనసాగుతుంది. ఫిల్మ్ నగర్లో జనం ఎక్కువ ప్లోటింగ్ ఉంటుంది. కాబట్టి మజ్జిగ, లెమన్ వాటర్, మినరల్ వాటర్ తో ఇవ్వబడుతుంది. మా అసోసియేషన్ ప్రజలకి ఎంతో ఋణపడివుంది. వారివల్లే మేమంతా ఈ స్థాయిలో ఉన్నాం. మా సబ్యులకు వెల్ఫేర్ ఇంపార్టెన్స్ ఇస్తూ చేస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వానికి అనుసంధానం చేస్తూ.. ప్రభుత్వ పథకాలన్నీ కూడా ప్రతిఒక్కరికీ అందేలా హెల్ప్ చేస్తున్నాం.. అన్నారు.

జనరల్ సెక్రటరీ జీవితారాజశేకర్ మాట్లాడుతూ.. చలివేంద్రం అనేది చాలా చిన్న పని అయినా అందరికీ చాలా ఉపయోగకరమైనది. దీనిని ప్రతిఒక్కరూ ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి. అన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here