బర్త్ డే స్పెషల్: చెర్రీ లైఫ్ లోని కీలక అంశాలు

0
220

నేడు (మార్చి 27) మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు. 27 మార్చి 1985 సంవత్సరంలో చిరంజీవి- సురేఖ దంపతులకు జన్మించిన ఈయన 34వ పుట్టినరోజు ఈ రోజు. ఈ సందర్భంగా ఆయనకు సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. టాలీవుడ్ హీరో హీరోయిన్లు మొదలుకొని బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ వరకూ సోషల్ మీడియాలో ఆయనకు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అనతికాలంలోనే ఆయన అమాంతం క్రేజీ హీరోగా గుర్తింపు పొందిన ఈయన.. తన ప్రస్థానాన్ని సాగించారిలా..

రాముని చరణాల యందు తేజస్సుతో ప్రకాశించేవాడనే అర్థం వస్తుందట రామ్ చరణ్ అంటే. తాను నమ్మే ఆంజనేయ స్వామి అంశతో పుట్టారని చిరు ఈ పేరు పెట్టారట. చెన్నైలో విద్యాబ్యాసం మొదలు పెట్టిన చరణ్.. ఊటీలో హైయ్యర్ ఎడ్యుకేషన్ పూర్తి చేశారు. బీ కామ్ జాయిన్ అయి మధ్యలోనే ఆపేసిన ఆయన.. తన తండ్రి చిరుని స్ఫూర్తిగా తీసుకొని నటన, డాన్స్‌లో శిక్షణ పొందారు. 2007లో ‘చిరుత’ సినిమాతో హీరోగా పరిచయమైన చెర్రీ.. మొదటి సినిమాతోనే మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ‘మగధీర’ సినిమాతో క్లాస్, మాస్ ఆడియన్స్ అందరినీ ఆకర్షించారు. ఉపాసనను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెద్దల అంగీకారంతో జూన్ 14, 2012 లో వీరి వివాహం జరిగింది. చెర్రీ జీవితంలోకి ఆమె ఎంటరయ్యాక చాలా మార్పులు చోటుచేసుకున్నాయని అంటారు ఆయన సన్నిహితులు. ‘జంజీర్’ సినిమాతో బాలీవుడ్‌లో కూడా అడుగుపెట్టిన చెర్రీ.. ఆ సినిమా డిసాస్టర్ కావడంతో మళ్ళీ బాలీవుడ్‌లో సినిమా చేయలేదు. ‘రంగస్థలం’ సినిమాతో చెదిరిపోని రికార్డుకు తన ఖాతాలో వేసుకున్నాడు. చిరు రీ ఎంట్రీ ఇచ్చిన ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాతో నిర్మాతగా మారిన రామ్ చరణ్.. ప్రస్తుతం భారీ బడ్జెట్‌తో ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా రూపొందిస్తున్నారు. మరోవైపు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌తో కలిసి ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. సినీ ఇండస్ట్రీలో చరణ్‌కి.. శర్వానంద్, రానా మంచి స్నేహితులు. మహేష్ బాబు, ఎన్టీఆర్ లతో కూడా చరణ్ చాలా సన్నిహితంగా ఉంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here