బాబాయ్’ పవన్‌ కోసం రంగంలోకి దిగిన ‘అబ్బాయ్’!

0
382

జనసేన అధినేత పవన్ కల్యాణ్ అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. దీంతో నిన్న, ఇవాళ ఎన్నికల ప్రచారానికి ఆయన దూరంగా ఉన్నారు. దీంతో పవన్‌కు అండగా ఉండేందుకు మెగా ఫ్యామిలీ కదిలింది. తమ్ముడి కోసం మెగాస్టార్ రంగంలోకి దిగుతారని నిన్న సాయంత్రం నుంచి పెద్ద ఎత్తున పుకార్లు వచ్చిన విషయం విదితమే. అయితే రెండ్రోజుల ముందే ‘అన్నయ్య’ ఇక రారని స్వయానా పవన్ కల్యాణే చెప్పడం జరిగింది. అయితే బాబాయ్ కోసం నేనున్నా.. అంటూ మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ సిద్ధమయ్యారు. ఇప్పటికే పలుమార్లు బాబాయ్ ఒక్క మాట చెబితే మరుక్షణమే రణరంగంలోకి దూకుతానని చెర్రీ చెప్పడం జరిగింది. అయితే ఆ సమయం ఆసన్నమైంది. గత రెండ్రోజులుగా బాబాయ్ ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేకపోవడంతో మెగా హీరోలు రంగంలోకి దిగుతున్నారు.

బాబాయ్ కోసం అబ్బాయ్..
రామ్‌చరణ్ కొద్దిసేపట్లో బాబాయ్ ఉన్న విజయవాడకు చేరుకోనున్నారు. పవన్‌‌తో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిణామాల గురించి పవన్‌తో అబ్బాయ్‌ చర్చించనున్నారు. అనంతరం ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొననున్నారు. కాగా రాబోయే రెండ్రోజులు పవన్ వెంటే చెర్రీ ఉంటారు. సో మొత్తానికి చూస్తే బాబాయ్ కోసం అబ్బాయ్ రంగంలోకి దిగారన్న మాట. ఈ రెండ్రోజులూ పవన్ వెంట ఉండి ఎన్నికల ప్రచారంలో చెర్రీ స్పీచ్‌‌లు అదరగొడతారేమో. ఇప్పటికైనా మెగా ఫ్యామిలీ నుంచి చెర్రీ రావడంతో అటు అభిమానులు, జనసేన కార్యకర్తలు ఆనందంలో మునిగి తేలుతున్నారు. చెర్రీ రాక జనసేనకు ప్లస్ అయ్యే అవకాశాలున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.

చిరునే పంపించారా..!?
జనసేనకే కాదు రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్న చిరంజీవి ‘సైరా’తో బిజిబిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే రాజకీయాలకు దాదాపు స్పస్తి చెప్పేసిన చిరు.. జనసేన గురించి అస్సలు పట్టించుకోలేదు. దీంతో మెగాభిమానులు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. మరోవైపు నాగబాబు రంగంలోకి దిగడమే కాకుండా ఎంపీగా పోటీ చేస్తుండటంతో మెగాభిమానులు, కార్యకర్తల్లో కాసింత అసంతృప్తి తగ్గింది. అయితే అటు మెగాస్టార్ రాక.. ఇటు మెగా ఫ్యామిలీలో డజన్ మంది హీరోలు ఉన్నప్పటికీ ఒక్కరూ రాలేదు. అయితే తాజాగా రామ్‌చరణ్ రంగంలోకి దిగడంతో సీన్ మారింది. చిరునే దగ్గరుండి చెర్రీని పవన్ దగ్గరికి పంపినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే చెర్రీ రాక జనసేనకు ఏ మాత్రం ప్లస్ అవుతుందో.. తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here