బ్రేకింగ్: లక్షా ఇరవై వేల మెజార్జీతో హరీష్ రావు విజయం

1
616

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎన్నికలకు సంబంధించి 119 స్థానాలలో కౌంటింగ్ మొదలై.. ఆసక్తికర విషయాలు ఇప్పుడిప్పుడే వెలువడుతున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్ పెద్దలందరూ వెనుకంజలో ఉండగా.. మొదటి నుంచి అనుకుంటున్నట్లుగానే టీఆర్ఎస్ అభ్యర్థులు భారీ ఆధిక్యంతో దూసుకుపోతున్నారు. అప్పుడే టీఆర్ఎస్ పార్టీ వాకిళ్లలో సంబరాలు మొదలయ్యాయి. ఇక టీఆర్ఎస్ నేత, సిద్ధిపేట అభ్యర్థి హరీష్ రావు లక్షకు పైగా మెజారిటీతో.. ఈ ఎన్నికల్లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ విజయంతో డబుల్ హ్యాట్రిక్ సాధించిన హరీష్ రావు మొత్తం 1, 19,622 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. పోలైన ఓట్లలో 80 శాతానికి పైగా ఓట్లు హరీష్ రావుకే దక్కడం ఈ ఎన్నికలలోనే పెద్ద రికార్డు.

ప్రస్తుతం 119 స్థానాలకు గానూ TRS 89, ప్రజాకూటమి 19, బిజెపి 2, MIM 5, స్వతంత్రులు 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here