భట్టి గెలుపు కష్టమేనా?

2
611

డిసెంబర్ 7న తెలంగాణలో ఎన్నికలు జరగనుండటంతో పార్టీలు ఎత్తులు పైఎత్తులతో ముందుకు వెళుతున్నాయి. ఒక్కొక్క నియోజకవర్గం ఒక్కొక్క పార్టీకి ఫేవర్‌గా ఉంది. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గానికి వస్తే మహాకూటమి తరుఫున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క బరిలో ఉన్నారు. టీఆర్ఎస్ తరుఫున లింగాల కమల్‌రాజ్, స్వతంత్ర అభ్యర్థిగా కోట రాంబాబు బరిలో ఉన్నారు. అయితే ఈ నియోజకవర్గంలో మొదట్లో మిశ్రమ స్పందన వ్యక్తమైనప్పటికీ రానురాను భట్టి గెలుపు కష్టంగా కనిపిస్తోంది.

టీఆర్ఎస్‌ అభ్యర్థి కమల్‌రాజ్‌కు పరిస్థితులు అనుకూలంగా మారిపోతున్నాయనేది అక్కడి రాజకీయ విశ్లేషకుల వాదన. దీనికి కారణం.. నియోజకవర్గ ప్రజలకు భట్టి అందుబాటులో ఉండరనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. అలాగే భట్టి ఇప్పటి వరకూ నియోజకవర్గానికి పెద్దగా చేసిందేమీ లేదనేది ప్రజల వాదన. దీనికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లేకపోవడం ఒకటైతే ఖమ్మం జిల్లా మొత్తమ్మీద కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే భట్టి ఒక్కరే కావడం మరో కారణంగా కనిపిస్తోంది. అలాగే తన నియోజకవర్గ ప్రజలకు మంజూరైన పథకాలను వారికి చేర్చడంలో భట్టి చాలా జాప్యం చేస్తున్నారనే ఆరోపణ బాగా వినిపిస్తోంది. ఇవన్నీ కమల్‌రాజ్‌కు అనుకూలిస్తున్న అంశాలు.

అలాగే ప్రజలతో మమేకమవడం.. తన ప్రచారంలో భాగంగా అన్ని వర్గాల ప్రజలనూ కలుసుకోవడమే కాకుండా.. ఇంటింటి ప్రచారంలోనూ ముందుడటం.. అలాగే ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు.. కమల్ రాజ్ ఎమ్మెల్యే అయితేనే తమకు సవ్యంగా చేరుతాయనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. అలాగే స్వతంత్ర అభ్యర్థిగా ఉన్న రాంబాబు ఎక్కువగా కాంగ్రెస్ ఓటు బ్యాంకును చీల్చే అవకాశం ఉంది. ఇది మాత్రమే కాకుండా… నియోజకవర్గ ప్రజలు నాయకత్వ మార్పును కోరుకోవడం కూడా కమల్‌రాజ్‌కు బాగా కలిసొస్తోంది. దీంతో ఈసారి మధిర నియోజకవర్గం నుంచి కమల్‌రాజ్ గెలుపు ఖాయంగా కనిపిస్తోంది.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here